హైదరాబాద్ దుర్గం చెరువు వద్ద మైండ్ బ్లాక్ చేసే సీన్.. భారీ కొండచిలువ

హైదరాబాద్ ఐటీ హబ్‌ మాదాపూర్ దుర్గం చెరువు పరిసర ప్రాంతంలో గురువారం రాత్రి ఓ ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఓ సాఫ్ట్‌వేర్ సంస్థ కార్యాలయం సమీపంలో భారీ కొండచిలువ హఠాత్తుగా ప్రత్యక్షమైంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు, రాత్రి వేళల్లో విధులకు హాజరయ్యే ఐటీ ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పరుగులు తీశారు. నిత్యం జనసంచారంతో ఎంతో రద్దీగా ఉండే దుర్గం చెరువు ఐటీ లేన్ పరిసరాలలో ఇంత పెద్ద కొండచిలువ కనిపించడం ఆశ్చర్యానికి గురి చేసింది.

దీనికి సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఐటీ కార్యాలయానికి వెళ్లే ప్రధాన ద్వారానికి సమీపంలో ఆ పెద్ద కొండచిలువ కనిపించింది. దీన్ని గమనించిన వాహనదారులు స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకున్నాడు. ఎంతో చాకచర్యంగా, దానికి ఎటువంటి హాని కలగకుండా సురక్షితంగా పట్టుకున్నాడు. తన చేతికి చుట్టుకుని స్కూటర్ పై వెళ్లిపోయాడతను.

Huge Indian Rock Python Rescued Near Hyderabad s Durgam Cheruvu IT Hub Safely Moved to Safety

10- 15 ఏళ్ల కిందటి వరకు కూడా దుర్గం చెరువు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు మినీ అడవిని తలపించేవి. పెద్ద పెద్ద రాతి గుట్టలు, సహజసిద్ధమైన పొదలతో వన్యప్రాణులకు అనుకూలమైన ప్రదేశంగా ఉండేవి. ఈ భౌగోళిక కారణాల వల్ల ఇక్కడ వన్యప్రాణుల సంచారం ఎప్పటి నుంచో సహజంగానే ఉంటోంది. ఇటీవలి కాలంలో ఐటీ కారిడార్‌లో కాంక్రీట్ కట్టడాలు రికార్డు స్థాయిలో పెరిగిపోవడంతో వాటి సహజ ఆవాసాలు క్రమంగా హరించుకుపోయాయి.

భార్యకు ఐఫోన్ కోసం ఇంట్లో బంగారాన్నే అమ్మేశాడు.. !!
భార్యకు ఐఫోన్ కోసం ఇంట్లో బంగారాన్నే అమ్మేశాడు.. !!

భారీ వర్షాలు కురిసిన సమయంలో వాటి నివాసాల్లోకి పెద్దఎత్తున నీరు చేరినప్పుడు ఇటువంటి కొండచిలువలు లేదా సరీసృపాలు పొడి ప్రదేశాల కోసం హఠాత్తుగా రోడ్లపైకి వస్తుంటాయని చెబుతున్నారు. రాత్రి సమయాలలో షిఫ్ట్‌లకు వెళ్లే ఐటీ ఉద్యోగులు, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేవారు దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జి చుట్టుపక్కల మార్గాల్లో వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.

ఏపీ మీదుగా చెన్నైకి ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు
ఏపీ మీదుగా చెన్నైకి ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు

కార్యాలయాల ప్రాంగణంలో లేదా ఖాళీగా ఉన్న నిర్జన స్థలాలలో పాములు కనిపిస్తే సొంతంగా వాటిని పట్టుకోవడానికి కానీ, లేదా చంపడానికి కానీ సాహసించకూడదని సూచించారు. అటువంటి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే అటవీశాఖ హెల్ప్‌లైన్‌కు లేదా స్వచ్ఛంద వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ గ్రూపులకు సమాచారం అందించి సకాలంలో రక్షించాల్సిందిగా వన్యప్రాణి సంరక్షణ నిపుణులు సూచిస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+