బర్త్ డే ట్రీట్ అదుర్స్.. గెట్ రెడీ ఫర్ "వార్" అంటున్న తారక్

గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. అంచెలంచెలుగా ఎదుగుతూ అభిమానులు సంపాదించుకున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక దేవరతో ఆ జోష్ ని కంటిన్యూ చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఆయన నటిస్తున్న చిత్రం 'వార్ 2'. అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ 'వార్' సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తుంది. భారీ బడ్జెట్ తో ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా.. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఆగస్టు 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫయన్స్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది మూవీ యూనిట్.

తారక్ పుట్టిన రోజు సందర్భంగా "వార్ 2" మూవీ టీజర్ విడుదల చేశారు మేకర్స్. యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టిన ఈ టీజర్ ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చేస్తుంది. ముఖ్యంగా నా కళ్లు నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతున్నాయి కబీర్ అంటూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో టీజర్ స్టార్ట్ అవుతుంది. ఇండియాలో బెస్ట్ సోల్జర్, రా లో బెస్ట్ ఏజెంట్.. నువ్వే.. కానీ ఇప్పుడు కాదు.. నీకు నా గురించి తెలీదు.. ఇప్పుడు తెలుసుకుంటావ్.. గెట్ రెడీ ఫర్ వార్ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి.

war-2-movie-teaser-released-as-jr-ntr-birth-day-gift

అలానే ఎన్టీఆర్, హృతిక్ ఎంట్రీ లు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. యాక్షన్ సీక్వెన్స్ సైతం నెవ్వర్ బిఫోర్ అనేలా దుమ్మురేపుతున్నాయి. ఇక ఈ టీజర్ చివర్లో హీరోలు ఇద్దరు తలపడే సీన్.. మళ్లీ ఆర్ఆర్ర్ ని గుర్తు చేసింది. అలానే టీజర్ కి కియారా గ్లామర్ కూడా కలిసొచ్చింది. దీంతో ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా దూసుకుపోతుంది.

మరోవైపు ఈ మూవీలో హృతిక్, ఎన్టీఆర్ మధ్య అదిరిపోయే డ్యాన్స్ సీక్వెన్స్ కోసం ప్లాన్ చేస్తున్నారట. ఆ స్పెషల్ సాంగ్ కోసం భారీ సెట్ వేసి ఏకంగా 500 మంది డాన్సర్లను రంగంలోకి దించుతున్నట్టు అప్పట్లో టాక్ నడిచింది. ఈ సినిమాకు ప్రీతమ్ సంగీతం అందిసన్నారు. తమకి తామే పోటీ అనేలా చెలరేగే ఈ ఇద్దరు డాన్సర్లు.. ఈసారి కలిసి డాన్స్ చేస్తే థియేటర్లు తగాలబడిపోవడం గ్యారంటీ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. డాన్స్ తో పాటు యాక్షన్ లోనూ తగ్గేదే లే అనేలా ప్లాన్ చేస్తున్నారని ఈ టీజర్ చూస్తుంటే తెలుస్తోంది.

మరోవైపు ఈ సినిమా తారక్‌ బాలీవుడ్‌ డెబ్యూ చిత్రం కావడంలో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంతో పాటు ఎన్టీఆర్‌ చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత కొరటాల శివతో దేవర 2 చేయనున్నట్టు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+