'వార్ 2' VS 'కూలీ' : ఆ సినిమాదే పైచేయి..!

రెండు దిగ్గజ సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ నటించిన 'వార్-2' మరియు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కూలీ' సినిమాలు ఒకేరోజు విడుదల కాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.'వార్-2' ఒక హై- యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది.ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య వచ్చే పోరాటాలు అభిమానులను ఆకట్టుకుంటాయని అంచనా వేస్తున్నారు.

మరోవైపు 'కూలీ' రజనీకాంత్ స్టైల్, మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన సినిమాగా ప్రచారం పొందుతోంది.ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద పెద్ద పోటీ తప్పదని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ రెండు సినిమాలలో ఏ సినిమాది పై చేయి అని చూస్తే..కచ్చితంగా రజనీకాంత్ నటించిన 'కూలీ' సినిమానే కాస్తా హైప్‌లో ఉనట్టు కనిపిస్తోంది.

War 2 vs Coolie Which Film Has More Pre-Release Hype

రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే, 'కూలీ' స్పష్టంగా పైచేయి సాధించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే రూ. 75 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా, తొలిరోజు రూ. 120-150 కోట్ల గ్రాస్ రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు.ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటకలో 'కూలీ' మేనియా తీవ్ర స్థాయిలో ఉంది.

కొన్ని కంపెనీలు ఉద్యోగులకు సెలవులు ప్రకటించగా, బెంగళూరులో 1050 షోలకు అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ రెండు సినిమాలు పోటాపోటీగా ఉన్నాయి. నాగార్జున విలన్‌గా నటించడం వల్ల 'కూలీ'కి ఇక్కడ ఎక్కువ హైప్ వచ్చిందని నెటిజన్లు అంటున్నారు. అయితే, 'వార్ 2' బుకింగ్స్ ఆలస్యంగా ప్రారంభం కావడం వల్లే వెనుకబడిందని, రిలీజ్ రోజు తమ సత్తా చూపిస్తామని ఎన్టీఆర్ అభిమానులు సవాల్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+