సమంతతో నటించొద్దని వాళ్లు నాకు వార్నింగ్ ఇచ్చారు - స్టార్ హీరో
హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికి తెలిసినవే. తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళను ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు.సమంత మాత్రం ప్రస్తుతానికి ఒంటరిగానే ఉంటున్నారు. సమంత సినిమాల్లో నటించి ఏడాదిన్నరకు పైగానే అయింది.
సమంత చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి 'ఖుషి' సినిమాలో కనిపించింది. ఈ సినిమా తర్వాత ఆమె మరో సినిమాలో కనిపించలేదు. అయినప్పటికీ సమంత క్రేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. సమంత నుంచి సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు అతృతగా ఎదురు చూస్తున్నారు. ఆరోగ్య సమస్యలతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న సమంత..తిరిగి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. సమంత ప్రస్తుతం ''సిటాడెల్'' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో వరుణ్ ధావన్ సమంతపై కీలక వ్యాఖ్యలు చేశారు.

సమంతతో నటించద్దని చాలామంది నాకు సలహాలు ఇచ్చారని వరుణ్ ధావన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. సినీ ఇండస్ట్రీకి చెందిని కొందరు సమంతతో యాక్ట్ చేయవద్దని, అలా చేస్తే నీకున్న క్రేజ్ పోతుందంటూ వార్నింగ్ ఇచ్చారని వరుణ్ ధావన్ తెలిపారు. అయిన వారి మాటలను నేను లెక్క చేయకుండా సమంతతో యాక్ట్ చేశానని వరుణ్ ధావన్ చెప్పారు. సమంత వంటి టాలెంటెడ్ యాక్టర్‌తో నటించడం చాలా హ్యాపీగా ఉందని వరుణ్ ధావన్ చెప్పుకొచ్చారు. హీరోలకు ధీటుగా ఆమె చేసిన ఫైట్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయని అతను తెలిపాడు.
సమంత నటించిన 'ఈగ' సినిమాలో ఆమె నటనకు నేను ఫ్లాట్ అయిపోయానని వరుణ్ ధావన్ పేర్కొన్నాడు. అప్పటి నుంచి సమంత అంటే నాకు చాలా ఇష్టమని ఈ బాలీవుడ్ హీరో చెప్పుకొచ్చాడు. సామ్‌తో సినిమా అవకాశం వచ్చినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వరుణ్ ధావన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వీరిద్దరు కలిసి నటించిన ''సిటాడెల్'' వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలైంది.
ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతోంది. వరుణ్ ధావన్‌తో పాటు సమంత కూడా యాక్షన్ సీక్వెన్స్ చేసినట్టు స్పష్టం అవుతోంది. ఇదే విధంగా ఈ వెబ్ సిరీస్‌లో సమంత బొల్డ్‌గా కనిపించారనే టాక్ వినిపిస్తోంది. టీజర్‌లో లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నట్టు చూపించారు. దీంతో వెబ్ సిరీస్‌లో రొమాంటిక్ సీన్స్‌కు కొదవలేదని అర్ధం అవుతోంది. వరుణ్ ధావన్-సమంతల మధ్య బొల్డ్ సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఆ సీన్లలో వీరిద్దరు రెచ్చిపోయి నటించారనే టాక్ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ట్రైలర్‌తో సమంత సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.












Click it and Unblock the Notifications