‘నోరు అదుపులో పెట్టుకో’... అనసూయపై సీనియర్ నటి హేమ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ చుట్టూ తిరుగుతున్న 'జై శ్రీరామ్' కాంట్రావర్సీ రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. శ్రీరాముడి నామాన్ని, ఫొటోలను అడ్డుపెట్టుకుని కొందరు సోషల్ మీడియాలో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ అనసూయ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి. ఆమె వ్యాఖ్యలపై భగ్గుమన్న హిందూ సంఘాలు బోరబండ పిఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కథ లీగల్ నోటీసుల దాకా వెళ్ళింది. డ్యామేజ్ కంట్రోల్ కోసం "నేనూ ఆంజనేయస్వామి భక్తురాలినే, కేవలం ట్రోలర్లనే అన్నాను" అని అనసూయ ఓ క్లారిఫికేషన్ వీడియో వదిలినప్పటికీ, మంటలు మాత్రం చల్లారలేదు.

Toxic First Review: టాక్సిక్ మూవీ ఫస్ట్ రివ్యూ.. హిట్టా..? ఫట్టా..?
Toxic First Review: టాక్సిక్ మూవీ ఫస్ట్ రివ్యూ.. హిట్టా..? ఫట్టా..?

హేమ ఎంట్రీ ఇచ్చారు
అనసూయ ఇచ్చిన వివరణతో ఈ వివాదానికి శుభం కార్డు పడిపోయిందని అందరూ భావిస్తున్న తరుణంలో సీనియర్ నటి హేమ అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చారు. అనసూయ తీరును తీవ్రంగా తప్పుబడుతూ హేమ విడుదల చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. సినీ పరిశ్రమలో ఉన్నారనే స్పృహ లేకుండా అనసూయ పదే పదే నోరుజారడం సరికాదని, మనమంతా అద్దాల మేడల్లో ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హేమ ఘాటుగా హెచ్చరించారు.

Watch your tongue Senior actress Hema makes sensational comments about Anasuya bharadwaj Full Details

జై శ్రీరామ్ అనేది కేవలం ఒక నినాదం కాదు, అది కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో నిలిచిన దివ్య మంత్రమని హేమ స్పష్టం చేశారు. "నిన్ను సోషల్ మీడియాలో ఎవరైనా వేధిస్తే ధైర్యంగా ఆ వ్యక్తుల పేర్లు బయటపెట్టి పోరాడు, అంతేగానీ పవిత్రమైన దేవుడి పేర్లను, ఫొటోలను వేలెత్తి చూపడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు" అంటూ అనసూయను నేరుగా ప్రశ్నించారు. మొదట నోరుజారి ఆ తర్వాత కవరింగ్ ఇచ్చుకోవడం మానుకోవాలని చురకలంటించారు.

కర్మ రూపంలో తిరిగొస్తాయి
మనం చేసే పనుల ఫలితం 'కర్మ' రూపంలో తిరిగొస్తుందని, ఎవరినీ అది వదిలిపెట్టదని హేమ స్పష్టం చేశారు. తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన ఆదరణతోనే ఈ స్థాయి గుర్తింపు వచ్చిందని, వారి నమ్మకాలను, విశ్వాసాలను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. హేమ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలతో టాలీవుడ్‌లో మళ్లీ వేడి పెరిగింది. మరి ఈ వ్యాఖ్యలపై అనసూయ మౌనంగా ఉంటుందా లేక తిరిగి తన మార్క్ కౌంటర్ ఇస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+