శోభిత ధూళిపాళ ఇంట పెళ్లి వేడుకలు ..హాజరైన సమంత
నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం సింపుల్‌గా జరిగిన సంగతి తెలిసిందే.శోభిత ధూళిపాళ కంటే ముందు నాగ చైతన్య,సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. సమంత ఒంటిరిగా ఉండగా, నాగ చైతన్య మాత్రం విడాకుల తర్వాత శోభిత ధూళిపాళతో నాగ చైతన్య సైలెంట్‌గా డేటింగ్ చేశాడు. ఇప్పుడు ఏకంగా ఆమెను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. అతి కొద్దిమంది సమక్షంలో నాగ చైతన్య, శోభిత ధూళిపాళల నిశ్చితార్థం జరిగింది.
త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది. ఈక్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించి కీలక ఆప్డేట్ బయటకు వచ్చింది.నాగ చైతన్య -శోభిత ధూళిపాళల పెళ్లికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. దీనిలో భాగంగానే శోభిత ధూళిపాళ నివాసంలో పసుపు కొట్టే కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను శోభిత ధూళిపాళ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో శోభిత ధూళిపాళ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. నిశ్చితార్థ కార్యక్రమానికి దూరంగా ఉన్న శోభిత ధూళిపాళ చెల్లెలు సమంత సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

శోభిత ధూళిపాళ్ల చెల్లెలు పేరు కూడా సమంత అనే విషయం తెలిసిందే. సమంత ధూళిపాళ్ల విషయానికి వస్తే.. వృత్తిరీత్యా డాక్టర్. బార్సిలోనా యూనివర్సిటీలో తన డాక్టర్ చదువు పూర్తి చేసి రేడియో రోగ నిర్ధారణ విభాగంలో ఎండీగా పని చేస్తోంది. అయితే సమంత ధూళిపాళ తన అక్క కంటే ముందే వివాహం చేసుకుని విదేశాల్లో ఉంటుంది.
అక్క నిశ్చితార్థానికి రాలేకపోయింది సమంత. అయితే అక్క పెళ్లి వేడుకలకు సమంత ముందుగానే స్వదేశానికి వచ్చినట్టు ఈ ఫొటోలను చూస్తే అర్థం అవుతోంది. వీరిద్దరు కలిసి ఉన్న ఫొటోలను శోభిత ధూళిపాళ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. పెళ్లి పనులకు సంబంధించిన ఫొటోలను శోభిత ధూళిపాళ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications