ప్రభాస్ సంచలన నిర్ణయం- డీయాక్టివేట్..?!

అమరావతి/హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం.. సలార్ (Salaar). రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ఇది. సలార్ పార్ట్ 1 సీస్‌ఫైర్ (Salaar: Part 1- Ceasefire) పేరుతో తొలి భాగం చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. ఈ ఏడాది డిసెంబర్ 22వ తేదీన విడుదల కాబోతోంది.

శాండల్‌వుడ్ స్టార్ దర్శకుడు, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. హొంబల్ ఫిల్మ్స్ బ్యానర్ కింద విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మించారు. ఇందులో టైటిల్‌ రోల్‌ను పోషిస్తోన్నారు ప్రభాస్. పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు, టిన్నూ ఆనంద్, శ్రీయారెడ్డి, ఇతర కీలక పాత్రలను పోషించారు. రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చారు.

What happened to Prabhas instagram? Is it hacked or deactivate

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు ప్రభాస్. తన కొత్త సినిమా సంగతులను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై పంచుకుంటుంటారు. ప్రత్యేకించి- ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ (Prabhas instagram)కు అద్దిరిపోయే ఫాలోయింగ్ ఉంది. కోటి మందికి పైగా ఈ అకౌంట్‌ను ఫాలో చేస్తోన్నారు.

అలాంటి ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్- తాజాగా మూగబోయింది. డీయాక్టివేట్ అయినట్టు కనిపిస్తోంది. ఒక్క పోస్ట్ కూడా అందులో డిస్‌ప్లే కావట్లేదు. ఇప్పటివరకు ఆయన పోస్ట్ చేసిన ఫొటోలు, వీడియోలు, షార్ట్ క్లిప్స్.. అన్నీ కూడా ఎరేజ్ అయ్యాయి. ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌ను ఓపెన్ చేసిన వారికి No post yet అనే అక్షరాలు కనిపిస్తోన్నాయి.

పోస్టులు, ఫాలోవర్స్, ఫాలోయింగ్, మెసేజ్.. ఇలా అన్ని కేటగిరీలు కూడా ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తోన్నారు. ఈ ఇన్‌స్టా అకౌంట్‌ను ప్రభాస్ డీయాక్టివేట్ చేశారా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తోన్నారు. అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

అదే సమయంలో మరికొందరు అభిమానులు మాత్రం- ఈ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైనట్లు చెబుతున్నారు. హ్యాకర్లు ఈ అకౌంట్‌ను హ్యాక్ చేశారని, తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారని వివరిస్తోన్నారు. ఇది మళ్లీ యాక్టివ్ కావడానికి అవసరమైన చర్యలను తీసుకుంటోన్నట్లు తెలియజేశారు. త్వరలోనే మళ్లీ పునరుద్ధరిస్తారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+