నాగచైతన్య పుట్టినరోజునాడు సమంత ఏం చేసిందో తెలుసా?
తెలుగు చలనచిత్ర సీమలో అక్కినేని నాగచైతన్య - సమంతల జంటకు ఎంత క్రేజీ పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున తర్వాత తలెత్తిన చిన్న చిన్న మనస్పర్ధల వల్ల విడాకులు తీసుకున్నారు. అయినప్పటికీ ఈరోజో, రేపో ఈ జంట మళ్లీ కలిసిపోతుందని, తప్పనిసరిగా బ్రేకప్ కు వారిద్దరూ బ్రేకప్ చెబుతారనే నమ్మకంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.
నవంబరు 23వ తేదీన నాగచైతన్య పుట్టినరోజు ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా ఎంతో సాదాసీదాగా తన జన్మదినాన్ని నాగచైతన్య సెలబ్రేట్ చేసుకున్నాడు. సమంతతో విడిపోయినప్పటి నుంచి నాగచైతన్య పెద్దగా పార్టీలు.. పబ్బులు అంటూ తిరగడం లేదని, ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికే ఇష్టపడుతున్నాడని సన్నిహితులు చెబుతుంటారు.

నాగచైతన్య మాజీ భార్య సమంత మాత్రం ఆయన పుట్టిన రోజు సందర్భంగా శివుడి గుడిలో ప్రత్యేక అభిషేకం చేయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మయోసైటీస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న సమంత తన భర్త పుట్టినరోజుకు విష్ చేయకపోయినా సరే ఆయన మాత్రం సంతోషంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ శివుడి గుడిలో అభిషేకం చేయించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై అక్కినేని ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇద్దరూ కలిసివుండాలనే ఆకాంక్షను వ్యక్తపరుస్తున్నారు. అయితే పుట్టినరోజునాడు గుడిలో పూజలు చేయించడంద్వారా నాగచైతన్యపై తన ప్రేమ సజీవంగా ఉంటుందనే విషయాన్ని సమంత తెలియజేసినట్లవుతోందని, వారిద్దరూ తిరిగి కలిసిపోతే సంతోషిస్తామంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications