Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వీడు హీరోనా..అల్లు అర్జున్‌పై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్

దిల్ రాజు ఏం మాట్లాడిన, ఏం చేసినా సంచలనమే అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. దిల్ రాజు గతంలో ఎప్పుడో అల్లు అర్జున్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే..ఏ మూహార్తనా "గేమ్ ఛేంజర్" సినిమాను దిల్ రాజు నిర్మించారో తెలియదు కానీ, అప్పటి నుంచి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. "గేమ్ ఛేంజర్" ఒకే ఒక్క సినిమా దిల్ రాజును ఆకాశం నుంచి పాతాళానికి పడేలా చేసింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌, తమిళ స్టార్ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'గేమ్ ఛేంజర్‌' సినిమాను దిల్ రాజు భారీగా నిర్మించారు. సుమారు రూ.450 కోట్ల రూపాయిలతో భారీ బడ్జెట్‌తో 'గేమ్ ఛేంజర్‌'ను నిర్మించడం జరిగింది. అయితే ఈ సినిమా మొదటి నుంచి కూడా ప్రేక్షకుల్లో అనుకున్నంత బజ్‌ను క్రియేట్ చేయలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అతి పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. 'గేమ్ ఛేంజర్‌' బాక్సాఫీస్ వద్ద రూ. 129.01 వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

When I saw Allu Arjun during the movie Gangotri I thought he was a hero - Dil Raju

దీని ఫలితంగానే "గేమ్ ఛేంజర్" బాక్సాఫీస్ వద్ద దారుణ ఫలితాన్ని చవి చూసింది. ఎంత తీసేసిన ఈ సినిమా రూ.250 కోట్లకు పైగానే నష్టాలను మిగిల్చినట్టు తెలుస్తోంది. వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా లేకపోతే దిల్ రాజు పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. "గేమ్ ఛేంజర్" ఫ్లాప్ కావడంతో దిల్ రాజు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా దిల్ రాజు నిర్మించిన సినిమా తమ్ముడు. ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో కూడా "గేమ్ ఛేంజర్" ఫ్లాప్ గురించి మాట్లాడారు దిల్ రాజు. అయితే దీనిపై మెగా అభిమానులు నుంచి తీవ్ర విమర్శలు రావడంతో దిల్ రాజు బ్రదర్స్ క్షమాపణలు చెప్పారు.

ఇదిలా ఉంటే గతంలో దిల్ రాజు అల్లు అర్జున్ గురించి మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ.. గంగోత్రి సమయంలో అల్లు అర్జున్ ఎలా ఉన్నారో వివరించారాయన. గంగోత్రి సినిమా సమయంలో అల్లు అర్జున్‌ను చూసి ఇతను హీరోనా అనుకున్నారని, కానీ ఆర్య సినిమాకు తనను తాను ఎలా మార్చుకున్నాడో అందరం చూశామని దిల్ రాజు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+