షాపింగ్ మాల్ ఓపెనింగ్‌ వెళ్తే కమిట్మెంట్ అడిగారు దరిద్రులు .. తెలుగు హీరోయిన్

ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతి చోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్‌, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. తాజాగా నటి ఎస్తెర్ సైతం కాస్టింగ్ గురించి చెప్పి షాకిచ్చింది.

నటి ఎస్తేర్ గురించి ప్రత్యేకంగా చేయాల్సిన పనిలేదు.ఎస్తర్ అందాలకు ప్రత్యేక అభిమానులు ఉన్నారంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కన్నడ సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత తెలుగులో హీరోయిన్‌గా ఇచ్చింది. పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా నటించిన వేయి అబద్ధాలు సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా నటించింది. మరీ ముఖ్యంగా భీమవరం బుల్లోడులో నటించిన తర్వాత ఈ బ్యూటీ క్రేజ్ మరింత పెరిగింది. ఇక తర్వాత గరం, జయ జానికి నాయక, జాలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, నయనం, ఐరావతం,69 సంస్కార్ కాలనీ, చాంగురే బంగారు రాజా, డేవిల్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ వంటి వాటిల్లో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది.

When I went to the opening of a shopping mall they asked for a commitment Telugu heroine

ఇక ప్రముఖ సింగర్ నోయెల్ సీన్‌‌తో కొన్నాళ్లు ప్రేమయాణం సాగించిన ఈ భామ .. 2019లో అతన్ని వివాహం చేసుకుంది. పెళ్లైన 16 రోజులకే అతన్ని నుంచి దూరంగా ఉంటుంది. ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో అతనికి విడాకులిచ్చింది. పెళ్లి తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఎస్తర్ గ్లామర్‌తో అదరగొట్టింది. ముఖ్యంగా రెక్కి సినిమాలో ఎస్తేర్ ఓ రేంజ్‌లో రెచ్చిపోయి అందాలను ఆరబోసింది. ఈ సినిమా తర్వాత చాలామంది ఎస్తేర్‌కు అభిమానులుగా మారిపోయారు. ఈ మధ్య టెనెంట్‌లో ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌గా తన నటనతో అదరగొట్టింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన ఎస్తేర్ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది. ఇప్పుడు దర్శకురాలిగా నిర్మాతగా మారింది ఎస్తేర్. ప్రస్తుతం హీరో ది వేకెంట్ హౌస్ అనే సినిమాను రూపొందిస్తుంది.

ఆ మధ్య ఆడవాళ్లకు కోరికులుంటాయని చెప్పి గట్టి షాకిచ్చింది. తాజాగా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురించి ఈ భామ స్పందించింది. ప్రతి రంగంలో మహిళలపై జరిగే అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇలాంటివి చేయడానికి అవకాశాలు ఎక్కువ. దాన్ని మనం దూరం చేయలేం. అమ్మాయిలు అందంగా, ఎన్నో ఆశలతో, ఇండస్ట్రీలో ఏదో సాధించాలని వస్తే కచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకోవాలి అనుకునే మనుషులు ఉన్నారు. ఎవరూ దాని గురించి బలవంతపెట్టరు. కానీ ఆ అవకాశం అయితే ఉందని చెప్పుకొచ్చింది.

మరి మీకు ఆ పరిస్థితి ఎదురైతే ఏం చేస్తారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. నేను అలా చేయలేను, నా దారిలో నేను వెళ్తాను అంటే ఎవరూ బలవంత పెట్టరు. అలా కాకుండా నాకు తొందరగా పెద్ద స్టార్ అవ్వాలని ఉంది ఏం చెప్పినా చేస్తాను అనుకునే వాళ్ళు కమిట్‌మెంట్ ఇవ్వాల్సిందే. వారికి అదే షార్ట్ కట్ అని ఎస్తర్ తెలిపింది. ఈ మధ్య తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఈ భామ బయటపెట్టింది. ఈ మధ్య షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి వెళ్తే.. వాళ్లు కూడా కమిట్‌మెంట్ అడుగుతున్నారని చెప్పి వాపోయింది. మాల్ ఓపెనింగ్‌కు కమిట్‌మెంట్ ఏంట్రా అనుకుని వచ్చేశానని , ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. కాస్టింగ్ కౌచ్ గురించి ఎస్తర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+