ఓటీటీలోకి అఖండ-2..? ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..!
నందమూరి బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వచ్చిన నాలుగో చిత్రం అఖండ-2.. సింహా, లెజెండ్, అఖండ తర్వాత ఇప్పుడు అఖండ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. డిసెంబర్ 12న పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో దేశం, దైవం, ధర్మం అనే మూలాల గురించి నేటి తరానికి వివరించిన తీరు అబ్బుర పరుస్తోంది. తాజాగా ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. అఖండ భారత్ బ్లాక్ బస్టర్ పేరుతో ఈ వేడుకను నిర్వహించారు.
అయితే ఈ మధ్యకాలంలో సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయినా.. రిలీజైన నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ చిత్రం థియేటర్లలో విడుదలై.. సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత నాలుగు వారాల్లోనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది. చాలా సినిమాలు ఇలానే ఉన్నాయి. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ అఖండ 2 చిత్రం కూడా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ సుమారు రూ. 80 కోట్లు వెచ్చించి ఓటీటీ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ మేరకు థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే అఖండ 2 ఓటీటీ రిలీజ్ చేయాలని మూవీ నిర్మాణ సంస్థ 14 రీల్స్ తో నెట్ ఫ్లిక్స్ ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
దీంతో ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో జనవరి 9న విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. అయితే అదే రోజున పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ క్రమంలో రాజాసాబ్ టికెట్స్ దొరకని ప్రేక్షకులు ఇంట్లో కూర్చొని కుటుంబ సభ్యులతో అఖండ 2 చిత్రం చూసే వీలుంది. సంక్రాంతి కానుకగా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కాస్త ముందుగానే అఖండ 2 చిత్రం రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

ఇక అఖండ 2 చిత్రం 2021 లో విడుదలైన అఖండ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కింది. ఈ మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్ లో మెప్పించారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. విలన్ పాత్రలో ఆది పినిశెట్టి మెరిశాడు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. అఖండ 2 చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ సంస్థ భారీ బడ్జెట్ తో తెరకెక్కించింది. పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో మూవీ విడుదలైంది.
-
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !!











Click it and Unblock the Notifications