బాలయ్య ఎక్కడ తప్పు చేశాడు? ‘అఖండ2’ వాయిదాకు సమాధానం లేని ప్రశ్నలు ఇవే!
అఖండ2 సినిమా వాయిదా పడిందంటే అది ఎటువంటి సందర్భాన్ని సృష్టించింది?. నందమూరి బాలకృష్ణ అంటే.. తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం తను ఉన్నంత జోష్ లో, ఫామ్ లో ఏ హీరో లేడు అని చెప్పొచ్చు. వరుసగా అన్నీ ఘనవిజయాలే నమోదు చేస్తున్నాడు. చిన్న హీరోనా అనుకుంటే.. కాదు.. పరిశ్రమలో 50 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాడు. అగ్ర కథానాయకుడు. చిరంజీవి, బాలకృష్ణ అనే ఇద్దరు అగ్ర కథానాయకులు ఒకరితో ఒకరు మూడు దశాబ్దాలకు పైగా పోటీపడుతూ వస్తున్నారు. పరిశ్రమకు రెండో తరంలో మూలస్తంభాల్లాంటి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఉన్నారు. అటువంటివారిలో ఒకరైన బాలయ్య సినిమా అనుకున్న సమయానికి విడుదల కావడంలేదంటే ఏమనుకోవాలి?
బాధ్యత దాంతో పూర్తవుతుందా?
సినిమా చేయడం వరకే హీరో బాధ్యత పూర్తవుతుందా? లేదంటే షూటింగ్ ప్రారంభం నుంచి విడుదలయ్యేవరకు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా? నిర్మాతకు ఆర్థికంగా ఇబ్బందులున్నాయా? సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయగలుగుతారా? అందులోను తన చిన్న కుమార్తె తేజస్విని తొలిసారిగా నిర్మాతగా తీస్తున్న చిత్రం కావడం.. సినిమా హక్కులు అమ్ముడుపోయాయా? ఎక్కడెక్కడ ఎంత ధర పలికింది? సినిమా విడుదలవడానికి అడ్డంకులేమీ లేవుకదా.. ఇలా అన్నీ ఒకసారి పరిశీలించుకోవాల్సిన బాధ్యత హీరోపైనే ఉంటుంది. ఎందుకంటే సినిమాకు మూలస్తంభం హీరో కాబట్టి. అతని ఇమేజ్ మీద ఆధారపడే ప్రారంభ కలెక్షన్లు వస్తాయి కాబట్టి.

బాలయ్య ఎక్కడ తప్పు చేశారు
కానీ నిర్మాతలకు ఎంతో అనుకూలంగా ఉండే బాలయ్య ఇప్పుడు ఎక్కడ తప్పు చేశారు? అనే సందేహం అభిమానుతోపాటు పరిశ్రమ పెద్దలను కూడా వేధిస్తోంది. రాత్రికి రాత్రే సినిమా వాయిదా పడిందంటే అందులో తప్పెవరిది? మద్రాసు హైకోర్టులో కేసు నడుస్తుందని హీరోకు, దర్శకుడికి తెలియదా? సమస్యను పరిష్కరించడానికి ముందుకు రాలేదా? అనుకున్న సమయానికి సినిమా విడుదల కాకపోతే బ్యాడ్ నేమ్ వస్తుందని అర్థం కాలేదా? రెండోసారి విడుదల తేదీ ఖరారైనా అప్పుడైనా వస్తుందా? రాదా? అనే అనుమానం అందరిలో ఉంటుందిగా? ఒకవేళ విడుదలైనా కలెక్షన్లు వస్తాయా? ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది బాలయ్యా? నిర్మాతలా? దర్శకుడా? అనే సందేహం ఇప్పుడు ప్రజల్లో, సినీ ప్రియుల్లో నెలకొంది.












Click it and Unblock the Notifications