చిరంజీవికి ఇష్టమైన తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు. 40 సంవత్సరాల నుంచి విభిన్నమైన పాత్రలను పోషిస్తూ, తన నటన, నృత్యాలు, పోరాటాలతో అందరినీ అలరిస్తున్నారు. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటోన్న దీనిపై అంచనాలను భారీగా ఉన్నాయి. త్రిష కథానాయిక కాగా, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. మెగాస్టార్ గా కొనసాగుతున్న చిరంజీవికి తెలుగు పరిశ్రమలో ఇష్టమైన హీరో, ఇష్టమైన సినిమా ఉంది.
కొన్ని సందర్భాల్లో చిరు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ నటన అంటే చిరుకు ఎంతో ఇష్టం. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ సినిమాను చిరు ఎన్నోసార్లు స్వయంగా చూశారు. ఆ సినిమాలో తారక్ యాక్షన్ అదిరిపోయిందని చెప్పొచ్చు. ఈ సినిమాలోని కోర్టు సన్నివేశంలో తారక్ నటనకు అందరినుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ సన్నివేశం కోసం టెంపర్ సినిమాను తాను ఎన్నోసార్లు చూసినట్లు చిరంజీవి చెప్పారు. ఈ సినిమా చేయడానికి ముందు తారక్ వరుసగా ఫ్లాప్స్ లో ఉన్నాడు. ఈ సినిమా కెరీర్ ను మలుపు తిప్పిందని చెప్పొచ్చు.

టెంపర్ తర్వాత తారక్ ఇంతవరకు ఎక్కడా వెనుదిరిగి చూడలేదు. వరుసగా ఆరు హిట్ సినిమాలిచ్చాడు. ప్రస్తుతం దేవర చిత్రం చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతోంది. చిరంజీవికి తారక్ అంటే ఇష్టమని, అతని నటన అంటే ఇంకా ఇష్టమని తెలియడంతో ఎన్టీఆర్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. సింహాద్రి, ఆది సినిమాల సమయంలో చిరంజీవికే పోటీ ఇచ్చే స్థాయిలో తారక్ ఉండేవాడు. తర్వాత కథల ఎంపికలో తప్పటడుగులు వేయడంతో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయ. దేవర తర్వాత వార్2, దీని తర్వాత ప్రశాంత్ నీల్ తో ఓ చిత్రం చేయబోతున్నాడు.












Click it and Unblock the Notifications