కోట శ్రీనివాసరావుకు ఇష్టమైన హీరో చిరంజీవి కాదు అతనే..!
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణం, తెలుగు సినీ లోకానికి తీరని లోటు. నటనకు నిఘంటువుగా, ప్రతి పాత్రకు జీవం పోసే విలక్షణ నటుడిగా ఆయనకు కోట్లాది మంది అభిమానులున్నారు. ఆయన గొంతులో పలికే ప్రతీ మాటా, ఆయన కళ్ళలో కనిపించే ప్రతి భావమూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఎలాంటి పాత్రనైనా అలవోకగా పోషించే సత్తా ఉన్న కోట, కేవలం నటుడిగానే కాకుండా ఒక మంచి వ్యక్తిగా, ఆదర్శంగా నిలిచారు.
ఆయన సినిమా ప్రయాణంలో ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి పని చేసినప్పటికీ, కోట శ్రీనివాసరావుకు అత్యంత ఇష్టమైన హీరో ఒకరున్నారు. ఆయనే నటసింహం నందమూరి బాలకృష్ణ. బాలకృష్ణతో కలిసి కోట అనేక చిత్రాలలో నటించారు. 'సింహా', 'లెజెండ్', 'జై సింహా' వంటి చిత్రాలలో వారి కాంబినేషన్ అదిరిపోయింది. ముఖ్యంగా బాలకృష్ణ సినిమా అంటే, అందులో కోట శ్రీనివాసరావు ఉండాల్సిందే అనేంతటి అనుబంధం వారిద్దరి మధ్య ఉంది.

బాలకృష్ణ పక్కన కనిపించినా, ఆయనకు ఎదురుగా నిలిచినా, కోట తనదైన శైలిలో ఆ పాత్రకు ప్రాణం పోసేవారు. బాలకృష్ణలోని అంకితభావం, క్రమశిక్షణ, ప్రేక్షకుల పట్ల ఆయనకున్న గౌరవం కోట శ్రీనివాసరావును ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే, ఎన్నోసార్లు బాలకృష్ణను తన అభిమాన నటుడిగా కోట శ్రీనివాసరావు బహిరంగంగా ప్రకటించారు. ఇక తరం నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమని ఆయన తెలిపారు. ఎటువంటి పాత్రనైనా జూనియర్ ఎన్టీఆర్ చాలా ఈజీగా చేస్తారని కోటా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అలాగే మహేష్ బాబు సైతం మంచి నటుడని ఆయన కితాబిచ్చారు.












Click it and Unblock the Notifications