జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లో ఎవరు నెంబర్ 1?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌లో ఎవరు నెంబర్ వన్, ఎవరు టాప్ అనే విషయం సామాజిక మాధ్యమాల్లో ఉధృతంగా నడుస్తోంది. ఒకరకంగా తారక్ అభిమానుల మధ్య, బన్నీ అభిమానుల మధ్య ఘోరమైన యుద్ధం నడుస్తోంది. వాస్తవానికి వీరిద్దరూ బయట ఎంతో స్నేహంగా ఉంటారు. బావా.. బావా.. అని పిలుచుకుంటారు. ఇద్దరూ తాము చేసే సినిమాల విషయాలను పంచుకోవడంతోపాటు కొత్తగా కథలను విన్నప్పుడు కూడా ఎలా అయితే బాగుంటుంది? ఎవరైతే బాగుంటుంది? ఎటువంటి మార్పులు చేస్తే బాగుంటుంది? అనే విషయాలను కూడా పంచుకునేంత సన్నిహితంగా ఉంటారు.

రూ.600 కోట్ల వరకు వెళ్లొచ్చు
అంతటి స్నేహంగా ఉండే వీరిద్దరి మధ్య ఎవరు నెంబర్ వన్ అనే విషయం ట్రెండింగ్ లోకి వచ్చింది. తారక్ ఇటీవలే దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. వాస్తవానికి ఈ సినిమాపై తొలిరోజు నుంచే మిక్స్ డ్ టాక్ రావడంతోపాటు వ్యతిరేక ప్రచారం బాగా సాగింది. అయినప్పటికీ వీటన్నింటినీ తట్టుకొని ఈ సినిమా సూపర్ హిట్ అయిందంటే అందుకు కారణం ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. మాస్ లో తనకున్న ఇమేజ్, రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఆర్ఆర్ఆర్ సినిమాద్వారా వచ్చిన క్రేజ్.. ఇవన్నీ కలిపి దేవరను ఎన్టీఆర్ విజయతీరాలకు చేర్చారు. ప్రస్తుతం రూ.500 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం లాంగ్ రన్ లో రూ.600 కోట్ల దగ్గర ఆగే అవకాశం ఉందంటున్నారు.

who is number one hero in junior ntr and allu arjun

దేవరను సులువుగా దాటేస్తాం
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2 చేస్తున్నారు. పుష్ప1 రూ.360 కోట్లు వసూలు చేసింది. తెలుగులో ఈ సినిమా సూపర్ హిట్ అవలేదు. కేవలం హిందీలోనే సూపర్ హిట్ అయింది. రూ.130 కోట్ల వరకు వసూలు చేసింది. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు. ప్రస్తుతం రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో మూడు సంవత్సరాలకు పైనుంచి నిర్మిస్తున్న పుష్ప2నపై అంచనాలు భారీగా ఉన్నాయి. బిజినెస్ కూడా భారీగా జరుగుతోందని, ఈ సినిమా టార్గెట్ రూ.వెయ్యి కోట్లని, సులువుగా వసూలు చేస్తామని బన్నీ అభిమానులు అంటున్నారు. ఈ సినిమా మీద తెలుగుకన్నా హిందీలోనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. విడుదలైన తర్వాత ఈ సినిమాకు వచ్చే కలెక్షన్లను బట్టి జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ మధ్య ఎవరు టాప్ అనే అంచనాలు తారుమారయ్యే అవకాశాలున్నాయి. సినిమా సినిమాకు ఇలాగే ఇవి తారుమారవుతాయనే విషయాన్ని గుర్తించకుండా అభిమానులు మాత్రం సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతూ యుద్ధం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+