పవన్ కల్యాణ్ కు ఇష్టమైన దర్శకుడు ఎవరో తెలుసా?

పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అభిమానులంతా ముద్దుగా పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి సినిమాతో తన పయనం ప్రారంభించిన పవన్ అప్రతిహతంగా దాన్ని కొనసాగిస్తున్నారు. మధ్యలో అనేక బ్లాక్ బస్టర్లు ఇచ్చారు.. ఫ్లాప్స్ ఇచ్చారు. అయినా తన రేంజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ దర్శకత్వంలో ఓజీ చేస్తున్నారు.

తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కల్యాణ్ అనేకమంది డైరెక్టర్లతో కలిసి పనిచేశారు. కొత్తవారికి అవకాశాలు కల్పించారు. అయితే ఆయనకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇష్టమైన దర్శకులు ఒకరు ఉన్నారు. ఆయన ఎవరో కాదు.. కె.రాఘవేంద్రరావు. కమర్షియల్ సినిమాలు తీస్తూ హీరో రేంజ్ ను రోజురోజుకు పెరిగేలా చేస్తూ తెలుగు సినీ పరిశ్రమను మలుపు తిప్పిన దర్శకుల్లో ఆయన ఒకరు. చిరంజీవితో జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి బ్లాక్ బస్టర్ అందించారు. ఆయన సినిమాలు చూస్తూ.. ఆయన ఏ తరహా చిత్రాలు చేసి హీరోలకు కమర్షియల్ ఇమేజ్ తీసుకువస్తున్నారు అనే విషయాలను దగ్గరుండి తెలుసుకుంటూ వచ్చారు.

who is Pawan Kalyans favorite director?

తెలుగులో ఇప్పటివరకు రాఘవేంద్రరావు చేసిన కమర్షియల్ తరహా సినిమాలు కూడా ఎవరూ చేయలేదు. అందుకే మొదటినుంచి పవర్ స్టార్ కు రాఘవేంద్రరావు అంటే వల్లమాలిన అభిమానం. ఈ విషయంపై గతంలో కూడా ఎన్నో వార్తలు వచ్చాయి. రాఘవేంద్రరావుతో ఒక సినిమా చేయాలని పవన్ కు ఉన్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం తాను చేస్తున్న మూడు సినిమాలను త్వరత్వరగా పూర్తిచేయాలనే ఉద్దేశంలో పవన్ ఉన్నారు. ఏపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతోపాటు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని వెళుతున్నారు. పొత్తుద్వారా వైసీపీకి తన సత్తా ఏమిటో చూపించాలనే పట్టుదలతో పవన్ ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+