కొరటాల శివ సన్సేషన్.. ఎన్టీఆర్ తర్వాత మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్?

దర్శకుడు కొరటాల శివ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన ప్రతి సినిమాలో సామాజిక సందేశం ఉండేటట్లు చూసుకుంటారు. దాన్ని వాణిజ్య అంశాలకు ముడిపెట్టి బ్లాక్ బస్టర్ హిట్ కొడతారు. మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలన్నీ ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. ఆచార్య సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. దీంతో కసిమీదున్న కొరటాల మరోసారి ఇండస్ట్రీ హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో దేవర చిత్రం చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటోంది.

దేవర పూర్తయిన తర్వాత ఏ హీరోతో చేస్తున్నాడా? అనే ఉత్కంఠ ఫిలిం నగర్ లో నెలకొంది. మిర్చి తర్వాత ప్రభాస్ తో మరో సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికీ కుదరడంలేదు. ఒక సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ కొరటాల శివ దర్శకత్వంలో తనకు సినిమా చేయాలని ఉందంటూ బహిరంగంగా చెప్పారు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరితో కొరటాల సినిమా చేయబోతున్నాడా? అనే చర్చ నడుస్తోంది.

who is the director koratala shiva next movie hero

ఒక సినిమా పూర్తికాగానే మరో సినిమాను ప్రస్తుత దర్శకులు సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు. ప్రభాస్ బిజీగా ఉండటంతో అల్లు అర్జున్ తో చిత్రం చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. పుష్ప2 పూర్తయిన తర్వాత అట్లీ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయబోతున్నాడు. దీనితర్వాత కొరటాల శివతో చేసే అవకాశం ఉందంటున్నారు. అప్పటికి దేవర విడుదలై ఘన విజయం సాధిస్తే ఓ లెక్కగా ఉంటుంది.. లేదంటే మరో లెక్కగా ఉంటుంది. సినిమా విజయాన్ని బట్టే హీరోలు కూడా దర్శకులను ఎంచుకుంటుంటారు. ప్రతి సినిమాను కచ్చితంగా సూపర్ హిట్ చిత్రంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత దర్శకులపైనే ఉంటోంది. లేదంటే స్టార్ హీరోలు అందుబాటులోకి రావడంలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+