ఇండస్ట్రీలో అప్పుడు శోభన్ బాబు అందగాడు.. ఇప్పుడు ఎవరో తెలుసా?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పుడు అందగాడెవరయ్యా? అంటే అందరూ ముక్తకంఠంతో శోభన్ బాబు పేరు చెప్పేవారు. చెరగని క్రాఫ్, నుదురుపై పడే వెంట్రుక, చిక్కటి తెలుపురంగుతో మిలమిలా మెరిసిపోతుండేవారు. మగవాళ్లు, ఆడవాళ్లతో సహా అందరూ శోభన్ బాబు అందానికి ముగ్ధులయ్యేవారు. వెండితెరపై ఆయన్ని అలానే కన్నార్పకుండా చూస్తుండిపోయేవారు. తరాలు మారుతున్నా శోభన్ బాబు అందాన్ని మించిన అందగాడు వస్తాడా? అంటూ తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

శోభన్ బాబు తర్వాత తరంలో అక్కినేని నాగార్జున మన్మథుడిగా పేరుతెచ్చుకున్నారు. అందగాడిగా, అమ్మాయిల కలల రాకుమారుడిగా నిలిచారు. ఆయనకుండే అభిమానుల్లో పురుషులకన్నా స్త్రీలే ఎక్కువగా ఉంటారు. అంతగా మహిళలు నాగార్జునను అభిమానించారు. ఆయన అందారిని ముగ్ధులయ్యారు. ప్రస్తుత తరంలో పరిశ్రమలో అందగాడు ఎవరు? అనే ప్రశ్న తలెత్తగా అందరూ ఏకగ్రీవంగా సూపర్ స్టార్ మహేష్ బాబుకే ఓటేస్తున్నారు.

who is the handsome hero in telugu film industry

సాధారణంగా వయసు పెరుగుతున్నకొద్దీ అందరికీ అందం తగ్గుతుంటుంది. కానీ మహేష్ బాబుకు మాత్రం వయసు పెరుగుతున్న కొద్దీ అందం కూడా రోజురోజుకు ద్విగుణీకృతమవుతోందంటే అతిశయోక్తి కాదు. అందం విషయంలో మహేష్ బాబు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. తన గ్లామర్ ను కాపాడుకోవడానికి పలు జాగ్రత్తలను తీసుకుంటారు. ఉప్పు, పంచదారకు దూరంగా ఉంటారు. ప్రస్తుతం ప్రిన్స్ అభిమానులంతా ఈ విషయంలో అతన్నే ఫాలో అవుతున్నారు. ఫ్యాన్స్ కూడా ఉప్పు, షుగరుకు దూరంగా ఉంటారు.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న పాన్ వరల్డ్ మూవీకి మహేష్ బాబు సిద్ధమవుతున్నాడు. దీనికి సంబంధించి ఇటీవలే జర్మనీ కూడా వెళ్లొచ్చారుకానీ పూర్తివివరాలు వెల్లడికాలేదు. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ యాడ్ లో నటించారు. అందులో మహేష్ ను చూసిన సినీ ప్రియులంతా అమితాశ్చర్యానికి లోనయ్యారు. ఇంత గ్లామర్ ఎలా సాధ్యమవుతుందని చర్చించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+