తెలుగు స్టార్ హీరోల్లో చిరంజీవికి ఇష్టమైన హీరో?
మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాల నుంచి అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు. బ్రేక్ డ్యాన్స్ ను తెలుగు తెరకు పరిచయం చేసి సంచలనం సృష్టించడంతోపాటు కోట్లమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఒక్కో మెట్టు అధిరోహిస్తూ చివరకు మెగాస్టార్ స్థాయికి చేరుకున్నారు. 69 సంవత్సరాల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీనిస్తూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. త్రిష కథానాయికగా నటిస్తోంది. వచ్చేఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది.
టెంపర్ అంటే చిరుకు ఎంతో ఇష్టం
చిరంజీవి ఎంత పెద్ద మెగా హీరో అయినప్పటికీ ఆయనకు కూడా ఇష్టమైన హీరోలు, ఆయనకు కూడా ఇష్టమైన సినిమాలు ఉంటాయి. దీనిపై విలేకరులు చాలాసార్లు గుచ్చిగుచ్చి ప్రశ్నించినప్పటికీ ఇటువంటి విషయాలను ఆయన స్వతహాగా బయటపెట్టరు. అయితే ఒక సందర్భంలో తెలుగు సినీ పరిశ్రమలో తనకు ఇష్టమైన హీరో పేరును వెల్లడించారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తారక్ నటించిన టెంపర్ సినిమాను చాలాసార్లు చూశానన్నారు. ఆ సినిమాలో తారక్ నటన తనను కట్టిపడేసిందని చెప్పారు. కోర్టు సన్నివేశంలో ఎన్టీఆర్ నటనకు అందరి నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి.

టెంపర్ సినిమాకు ముందు అన్నీ ఫ్లాప్సే
ఆ కోర్టు సన్నివేశం కోసమే టెంపర్ సినిమాను ఎన్నోసార్లు చూశానని చెప్పారు. టెంపర్ సినిమా చేయడానికి ముందు తారక్ వరుసగా ఫ్లాప్స్ లో ఉన్నాడు, ఈ సినిమా చేసిన తర్వాత వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా దేవర చేస్తున్నారు. దర్శకుడు శివ దీన్ని ఎంతో కసితో తీశాడని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చేనెల 27వ తేదీన దేవర దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల కాబోతోంది. జాన్వీకపూర్ కథానాయిక కాగా, అనిరుధ్ రవిచందర్ స్వరాలందించారు. నందమూరి ఆర్స్ట్, యువసుధ ఆర్ట్స్ పతాకంపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కల్యాణ్ రామ్ దీన్ని నిర్మిస్తున్నారు.












Click it and Unblock the Notifications