తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ ఆమే?
ఏ భాషకు చెందిన సినీ పరిశ్రమలోనైనా హీరోల విషయమే కాకుండా హీరోయిన్ల విషయంలో కూడా నెంబర్ వన్ ఎవరు? అనే చర్చ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది.
టాప్ టెన్ హీరోయిన్స్ లో నెంబర్ వన్ ఎవరు? 9 మందిని వెనక్కి నెట్టి ముందుకు వచ్చేది ఎవరు? అంటూ ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా సంక్రాంతి పండగను పురస్కరించుకొని వరుసగా సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో నెంబర్ వన్ హీరోయిన్ గా ఎవరు నిలవబోతున్నారు అనే చర్చ సినీ పరిశ్రమలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా జరుగుతోంది.
జనవరి 12న మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం, సైంథవ్, నా సామిరంగా, హనుమాన్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. గుంటూరు కారంలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి, హనుమాన్ చిత్రంలో అమృత అయ్యర్, సైంధవ్ లో శ్రద్ధ శ్రీనాథ్ , రుహాని శర్మ , ఆండ్రియా తోపాటు నా సామిరంగా సినిమాలో కన్నడ ముద్దుగుమ్మ ఆషికా రంగనాథన్ , మిర్నా మీనన్ , రుక్సార్ థిల్లాన్ నటిస్తున్నారు. ఇంత అదమైన హీరోయిన్లతో థియేటర్లనీ కళకళలాడటమేకాదు.. హీరోలందరికీ మంచి సూపర్ హిట్ సినిమాను అందించబోతున్నారు.

శ్రీ లీల మంచి ఫామ్ లో ఉండి వరుస విజయాలు కొడుతోంది. మీనాక్షి కూడా సక్సెస్ లోనే కనిపిస్తోంది. గుంటూరు కారంలో వీరిద్దరూ పోటీపడుతున్నారు. శ్రద్ధ శ్రీనాథ్, రుహాని , ఆండ్రియా కూడా కొంత గ్యాప్ తీసుకున్నారు. పరిశ్రమలోకి మంచి కంబ్యాక్ ఇచ్చారు. ఈ ముగ్గురూ ఒక విజయం కోసం ఎదురుచూస్తున్నారు. మిగతా భామలు కూడా అదే ఉత్సాహంతో ఉన్నారు. ఇంత మంది భామలు ఒకేసారి పోటీ పడుతుండటంతో సంక్రాంతి రేసులో నిలిచేది ఎవరు? టాప్ టెన్ జాబితాలో నెంబర్ వన్ గా ఎవరు నిలుస్తారు? అన్న ప్రశ్నకు సమాధానం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. వీరిలో టాప్ హీరోయిన్ గా ఎవరు నిలవబోతున్నారనేది సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు సాధించే విజయాలపై ఆధారపడివుంది.












Click it and Unblock the Notifications