ఇలాంటి వాళ్లను ప్రారంభంలోనే తొక్కేయాలి..సుడిగాలి సుధీర్‌పై ఆ స్టార్ హీరో..?
సుడిగాలి సుధీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుడిగాలి సుధీర్‌ను బుల్లితెర మెగాస్టార్‌గా పిలుస్తుంటారు. సుడిగాలి సుధీర్ ఉంటే ఆ షో సూపర్ హిట్ అయినట్టే. జబర్థస్త్ షోతో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన సుడిగాలి సుధీర్ ఆ తర్వాత టీం లీడర్‌గా ఎదిగాడు. పోవే పోరా, ఢీ వంటి షోలకు యాంకరింగ్ చేసి తన పాపులారిటీని మరింత పెంచుకున్నాడు. ముఖ్యంగా రష్మీ -సుడిగాలి సుధీర్‌ల మధ్య కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. టీవీ రంగంలో రష్మీ -సుడిగాలి సుధీర్‌లపెయిర్ సంచలనం సృష్టించారని అని చెప్పాలి.
వీరిద్దరూ కలిసి కనిపిస్తే చాలు ఆ షో సూపర్ హిట్ అనే రేంజ్‌కి వెళ్లిపోయిందంటే వీరి క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ షోల ద్వారా వచ్చిన పాపులారిటీతో వీరిద్దరు పలు సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకున్నారు. అయితే వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. షూటింగ్ తరువాత వీరిద్దరు కలుసుకున్న వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి.

ఇక రష్మీ -సుడిగాలి సుధీర్‌లు కలిసి ప్రస్తుతం షోస్ చేయనప్పటికీ.. ప్రతిరోజు కాల్ చేసి మాట్లాడుకుంటామని వారే స్వయంగా చెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే సుధీర్ ఆ మధ్య వరుసగా హీరోగా సినిమాలు చేశాడు.ఏం జరిగిందో తెలియదు కానీ, తిరిగి షోలు చేయడం మొదలుపెట్టాడు. అయితే దీనికి వెనుక పెద్ద కథే ఉందని ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది.
గోట్' సినిమాతో సుధీర్‌కి మంచి క్రేజ్ వచ్చింది, కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. 'గాలోడు' వంటి హిట్లతో సుధీర్‌కి మంచి భవిష్యత్తు ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, అతడి కెరీర్‌ను ముందుకు వెళ్లనివ్వకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని, దీని వెనుక ఒక సీనియర్ హీరో హస్తం ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కామెడీ, సెంటిమెంట్, డ్యాన్స్ వంటి వాటిల్లో చాలా టాలెంట్ ఉన్న నటుడు సుధీర్. శివకార్తికేయన్ లాగా ఎదుగుతాడని అనుకున్న సుధీర్‌ను ఇలా అడ్డుకోవడం దారుణమని అతని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, డ్యాన్స్ విషయంలో కూడా చాలామంది యువ హీరోలు సుధీర్ స్థాయికి రాలేరని చెప్పవచ్చు. అందుకే అతనికి అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నారని తెలుస్తోంది. యువ నటులను ప్రోత్సహించాల్సిన ఈ సమయంలో, కావాలని అవకాశాలు రాకుండా చేయడం సరికాదంటూ సినీ అభిమానులు హితవు పలుకుతున్నారు.ఈ సవాళ్లను సుధీర్ ఎలా ఎదుర్కొంటాడో, తన టాలెంట్‌తో ఎలా నిలబడతాడో చూడాలి.












Click it and Unblock the Notifications