గుర్తుపట్టలేని లుక్ లో షాక్ ఇచ్చిన టాలీవుడ్ హీరో..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న మూవీ పెద్ది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అయితే ఈ మూవీలోని నటీనటుల పాత్రలను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ వస్తోంది చిత్ర యూనిట్. అందులో భాగంగా ఒకప్పుడు టాలీవుడ్ హీరో.. ఇప్పుడు టాలీవుడ్ స్టైలిష్ విలన్ జగపతి బాబుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ మూవీలో జగ్గు భాయ్ అప్పలసూరి పాత్రలో జీవించినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ స్టైలిష్ విలన్ జగపతి బాబు ప్రస్తుతం పెద్ది మూవీ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ పోస్టర్ చూసినవాళ్లెవరూ ఆయన జగపతి బాబు అంటే నమ్మశక్యం కాదు. అంతలా ఛేంజ్ ఓవర్ అయ్యారు. ఈ చిత్రంలో అప్పలసూరి అనే పాత్రలో జగపతి బాబు నటిస్తున్నారు. మూవీలో జగ్గు భాయ్ ది కీలకమైన పాత్ర అని తెలుస్తోంది. ఈ లుక్ విషయానికి వస్తే.. కళ్లకు అద్దాలు పెట్టుకుని.. పాత చొక్కాతో.. నెరసిన గడ్డంతో ముసలివాడిలా కనిపిస్తున్నారు జగపతిబాబు.
The incredible @IamJagguBhai as 'APPALASOORI' from #Peddi ❤🔥
— PEDDI (@PeddiMovieOffl) December 29, 2025
Brace yourselves for his masterclass performance in a strong, impactful role 💥
#PEDDI WORLDWIDE RELEASE ON 27th MARCH, 2026. pic.twitter.com/1grBI4yQVX
ఇక పెద్ది మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్, చికిరి చికిరి సాంగ్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. చికిరి చికిరి సాంగ్ కోట్ల వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది. ఇటీవల దిల్లీలో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ .. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కానుంది.

ఈ మూవీలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యాటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.












Click it and Unblock the Notifications