పెళ్లి చేసుకోకపోతే ప్రభాస్ ఆస్తులు వారికే?
డార్లింగ్, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి, రాజాసాబ్ చిత్రాలు చేస్తున్నారు. వీటితర్వాత సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ చేయబోతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్2 చేయాల్సి ఉంది. ప్రస్తుతం దేశంలోనే నెంబర్ వన్ హీరోగా చెలామణి అవుతున్నాడు. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా నిలిచాడు. బాహుబలి తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిపోయిన ప్రభాస్ క్రేజ్ రోజురోజుకు పెరుగుతోందేకానీ తగ్గడంలేదు. బాహుబలి తర్వాత, సలార్ చిత్రానికి ముందు వరుసగా సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్.. వరుసగా ఫ్లాపయ్యాయి. అయినా కలెక్షన్లు మాత్రం బ్రహ్మాండంగా రాబట్టాయి.
కృష్ణంరాజు లేకపోవడం లోటే
మొదటి మూడురోజులు రూ.300 కోట్లు వసూళ్లు చేయడం అనేది ప్రభాస్ కు సర్వసాధారణమైపోయింది. సినిమాకు రూ.100 నుంచి రూ.150 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. వీలునుబట్టి లాభాల్లో వాటా తీసుకుంటాడు. ఆస్తుల విలువ కూడా భారీగా పెరిగిపోయింది. ఇళ్లు, ఖరీదైన ఫాంహౌస్‌లు, లగ్జరీ కార్లు, ఖరీదైన బంగ్లాలు, విదేశాల్లో ఇళ్లు ఉన్నాయి. ఆస్తులు భారీగా ఉన్నాయి. ఇప్పటికి 44 సంవత్సరాల వయసు ఉంది. పెళ్లిమాత్రం చేసుకోవడంలేదు. కృష్ణంరాజు బతికుండి ఉంటే ఏదో ఒకవిధంగా నచ్చచెప్పి వివాహం చేసేవారు.

వీరికే చెందుతాయంటున్నారు
ఆయన కన్నుమూయడంతో పెళ్లి ప్రయత్నాలు చేసేవారు కూడా కరువయ్యారు. అభిమానులు మాత్రం ఏఐ ద్వారా ప్రభాస్ కు అనుష్కతో వివాహం చేశారు. ప్రస్తుతం మాత్రం ఎవరూ ఆ ప్రస్తావన తీసుకురావడంలేదు. ప్రభాస్ పెళ్లి చేసుకోకపోతే ఆస్తులు ఎవరికి చెందుతాయి? అనే ప్రశ్న తలెత్తింది. డార్లింగ్ కు ప్రభోద్ అనే సోదరుడు, ప్రగతి అనే సోదరి ఉన్నారు. వీరిద్దరు కాకుండా పెదనాన్న కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. డార్లింగ్ తర్వాత కూడా వివాహం చేసుకోకుండా అలాగే ఉంటే అతని ఆస్తులన్నీ వీరికే చెందుతాయంటున్నారు. చూడాలి మరి మన డార్లింగ్ పెళ్లి చేసుకుంటాడో? లేదో?.












Click it and Unblock the Notifications