సౌందర్య ఇష్టపడ్డ హీరో ఎవరో తెలుసా..?

హీరోయిన్ సౌందర్య గురించి ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ, 1990ల్లో సౌందర్య అంటే తెలియని సినీ అభిమాని లేరు. అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్ ఈ రెండు కలిసి ఉన్న నటే సౌందర్య. ఈ రెండిటితో పాటు అదృష్టాం కలిసి రావడంతో సౌందర్య స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. కన్నడ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సౌందర్య, 1993లో మనవరాలి పెళ్లి మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ఒక్కొ సినిమా చేసుకుంటూ తెలుగు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు పొందింది.

అయితే సౌందర్యకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడు ఎవరంటే మాత్రం ఎస్వీ కృష్ణారెడ్డి అని చెప్పాలి. రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు వంటి సినిమాల్లో సౌందర్యకు ఎస్వీ కృష్ణారెడ్డి అవకాశాలు ఇచ్చారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌‌గా నిలిచాయి. దీంతో సౌందర్యకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. స్టార్ హీరోలతో సినిమాలు చేసి నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నారామె. తర్వాత తరం హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో సౌందర్యకు అవకాశాలు తగ్గిపోయాయి. ఈ సమయంలోనే సౌందర్య తీసుకున్న ఓ నిర్ణయం ఆమె మరణానికి కారణమైంది.

who Soundarya s favorite hero is

సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో సౌందర్య రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావించారు. ఈక్రమంలోనే ఆమె బీజేపీలో చేరారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరపున తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేయాలని అనుకున్నారు. బెంగుళూరు నుండి కరీంనగర్‌కి వెళ్లే క్రమంలో సౌందర్య విమాన ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె బ్రదర్ సైతం మరణించారు.

ఇదిలా ఉంచితే సౌందర్య చాలామంది హీరోలతో నటించినప్పటికీ, ఆమెకు ఓ హీరో అంటే బాగా ఇష్టపడేవారట. ఆ హీరో మరెవరో కాదు.. ఫ్యామిలీ హీరో జగపతి బాబు. అవును జగపతి బాబు అంటే సౌందర్యకు గౌరవంతో కూడిన ఇష్టమట. వీరిద్దరు కలిసి దాదాపు 10 సినిమాలు వరకు నటించారు.

"అంతఃపురం,శుభలగ్నం,ప్రియరాగాలు ,అల్లరి ప్రేమికుడు ,మూడు ముక్కలాట ,పెళ్ళి పీటలు ,సర్దుకుపోదాం రండి,భలే బుల్లోడు ,చిలకపచ్చ కాపురం , దొంగాట" .. ఈ సినిమాల్లో వీరిద్దరు కలిసి నటించారు. అయితే ఇదే సమయంలో వీరిద్దరి మధ్య ఎఫైర్ కూడా ఉందని రూమర్స్ తెర మీదకు వచ్చాయి. జగపతి బాబుకు అప్పటికే పెళ్లైంది. జగపతి బాబు కూడా ఓ ఇంటర్వ్యూలో సౌందర్యపై తనకున్న క్రష్‌ను బయపెట్టారు. అలాగే ఆమె చనిపోయిన తర్వాత ఆయన కంటతడి పెట్టుకున్నారు కూడా. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో దర్శనం ఇస్తుంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+