తెలుగు ఓటీటీ స్టార్ హీరో ఎవరో తెలుసా..? స్టార్ హీరోలకు కూడా ఇంత డిమాండ్ లేదు బాసూ

థియేటర్లకు ధీటుగా ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లు రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా చెప్పాలంలే ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమా ప్రపంచమే మారిపోయింది. అలాగే థియేటర్ల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఓటీటీలు ఎంట్రీ తర్వాత,వాటిని దృష్టిలో పెట్టుకుని సినిమాలను తెరకెక్కించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. సాధారణంగా ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ల హీరోలకు పెద్దగా డిమాండ్ ఉండదు. ఎందుకంటే వాళ్లకు పెద్దగా మార్కెట్ ఉండదు. కానీ ఓ తెలుగు హీరోకు తెలుగులో బీభత్సమైన డిమాండ్ ఉంది. ఆ హీరో మరెవరో కాదు..నవీన్ చంద్ర.

తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు నవీన్ చంద్ర.'అందాల రాక్షసి'తో కథానాయకుడిగా పరిచయమైనా, ఆ తర్వాత ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా కూడా తన నటనతో మెప్పించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిరూపించుకున్నారు. 'అరవింద సమేత వీర రాఘవ', 'భానుమతి రామకృష్ణ' వంటి చిత్రాల్లో ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలు నటుడిగా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా, విలన్ పాత్రల్లో నవీన్ చంద్ర చూపిన తీవ్రత, డెప్త్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

who the Telugu OTT star hero is

నవీన్ చంద్ర కెరీర్‌కు మరో అదనపు బలం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు. వెండితెరపై ఆయనకు అవకాశాలు తగ్గిన సమయంలో, ఓటీటీ ప్రపంచం ఆయనకు కొత్త ద్వారాలు తెరిచింది. ఓటీటీలో ఆయన నటించిన వెబ్ సిరీస్‌లు, సినిమాలు అఖండ విజయం సాధించాయి. , పరంపర, రిపీట్,28 డిగ్రీ సెల్సియస్, ఎలెవన్,బ్లైండ్ స్పాట్, ఇన్‌స్పెక్టర్ రిషి వంటి సూపర్ హిట్ సినిమాల్లో నవీన్ చంద్ర నటించారు.

ఓటీటీ కంటెంట్‌కు నవీన్ చంద్ర ఒక 'మిస్టర్ పర్ఫెక్ట్' ఛాయిస్ అయ్యారు. బలమైన కథాంశాలు, వాస్తవిక పాత్రలు ఉన్న సిరీస్‌లలో ఆయన తన సహజ నటనతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు నటుల ప్రతిభను పూర్తిస్థాయిలో ప్రదర్శించడానికి అవకాశం కల్పించాయి, ఈ అవకాశాన్ని నవీన్ చంద్ర సద్వినియోగం చేసుకున్నారు. ఆయన నటన, ఎంపిక చేసుకునే కథల వల్ల, ఓటీటీ నిర్మాతలు, దర్శకులు ఆయనకు అవకాశాలు ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+