నాగార్జునకేనా పరువుంది? పవన్ కల్యాణ్‌కు లేదా హీరోలూ?

భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహఖ అధ్యక్షుడు కేటీఆర్ పై విమర్శల తూటాలు పేల్చుతున్న కొండా సురేఖ గురితప్పి అక్కినేని నాగార్జున కుటుంబంపై పేల్చారు. అతని కుటుంబాన్ని రాజకీయ వివాదంలోకి లాగారు. ఈ సందర్భంగా ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు క్షమించరానివి. దీనిపై సినీ పరిశ్రమ యావత్తూ ఒక్కమాటలపై నిలబడింది. అక్కినేని నాగార్జున కుటుంబానికి మద్దతు ప్రకటించడంతోపాటు కొండా సురేఖ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. స్టార్ హీరోల నుంచి 24 విభాగాలకు చెందిన ప్రముఖులంతా సురేఖపై మండిపడ్డారు.

ఏ ఒక్క హీరో స్పందించలేదు
మన తెలుగులో స్టార్ హీరోలుగా చెలామణి అవుతున్న ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తోపాటు వెంకటేష్, రవితేజ, నాని.. తదితరులంతా ఉన్నారు. వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోసాని కృష్ణమురళి పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన్ను, ఆయన కుటుంబాన్ని పోసానితోపాటు వైసీపీ నాయకులంతా తీవ్రంగా దూషించారు. ఆ సమయంలో ఏ ఒక్క హీరో స్పందించలేదు. కనీసం ఒక స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదు. అంటే నాగార్జునకు ఒక్కడికే కుటుంబం ఉంది.. నాగార్జునకు ఒక్కడికే పరువుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Why didn t Telugu heroes react when Pawan Kalyan was severely criticized

గట్టిగా నిలబడింది పవన్ ఒక్కడే
వైఎస్ జగన్ ప్రభుత్వం సినిమా థియేటర్ల టికెట్ ధరలను బాగా తగ్గించినప్పుడు వాటిని గట్టిగా ప్రశ్నించి నిలబడింది కూడా పవన్ కల్యాణ్ ఒక్కడే. ఆ విషయం పరిశ్రమ మొత్తానికి సంబంధించిన విషయమైనా ఆ సమయంలో కూడా ఎవరూ ముందుకు రాలేదు. పవన్ కల్యాణ్ కు మద్దతివ్వలేదు. తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచుకోవాలంటే ఒంటరిగా వెళ్లి వినయంగా అడిగి అనుమతి తెచ్చుకున్నారు. నాగార్జున అయితే ఆ టికెట్ ధరలవల్ల తనకు ఎటువంటి ఇబ్బంది లేదని బహిరంగంగానే చెప్పేశారు.

అప్పుడు ఏమీ మాట్లాడని మన హీరోలు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? పవన్ కల్యాణ్ వ్యక్తిగత విషయాల గురించి తీవ్రంగా మాట్లాడినప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయంటే ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో రేవంత్ రెడ్డి మెతగ్గా ఉండటంతోపాటు వారికి స్వేచ్ఛనివ్వడమే దీనికి కారణం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంటే మన తెలుగు స్టార్ హీరోలంతా వెండితెరపైనే హీరోలు.. నిజ జీవితంలో జీరోలని అర్థమవుతోంది అంటున్నారు నెటిజన్లు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+