చిన్న కుర్రాళ్లతోనే డేటింగ్ ఎందుకు?
బాలీవుడ్ ఫిట్‌నెస్ దివా మలైకా అరోరా తన పర్సనల్ లైఫ్ ద్వారా ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. అర్బాజ్ ఖాన్‌తో విడాకుల అనంతరం ప్రముఖ నటుడు అర్జున్ కపూర్‌తో కొన్నేళ్ల పాటు ప్రేమాయణం నడిపిన మలైకా.. ప్రస్తుతం హర్ష్ మెహతా అనే డైమండ్ వ్యాపారితో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హర్ష్ మెహతా మలైకా కంటే 19 ఏళ్లు చిన్నవాడు కావడం విశేషం. ఈ క్రమంలో మలైకా వరుసగా తన కంటే చిన్నవయసు ఉన్నవాళ్లతోనే ఎందుకు ప్రేమాయణం నడుపుతున్నారనే అంశంపై ఓ సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషించారు.
చిన్న వయస్సు వారితో డేటింగ్.. కారణాలు
సిద్ధార్థ్ కన్నన్ నిర్వహించిన ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆ సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతూ.. సమాజంలో మహిళలు తమ కంటే చిన్నవారిని భాగస్వామిగా ఎంచుకుంటే ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటారని అభిప్రాయపడ్డారు. సాధారణంగా 40 ఏళ్ల పురుషులు 20 ఏళ్ల యువతులను వివాహం చేసుకుంటే ఎవరూ పట్టించుకోరాని.. కానీ మహిళల విషయంలో ఈ తేడాను ఎత్తిచూపుతారని వెల్లడించారు. మలైకా అరోరా ఆర్థికంగా స్వతంత్రురాలు, ఎంతో పరిణతి చెందిన మహిళ కావడం విశేషం. ఈ వయసులో తనకంటే పెద్దవారైన పురుషులతో డేటింగ్ చేస్తే.. వారి వైపు నుంచి ఎదురయ్యే ప్రశ్నలు లేదా నియంత్రణలు మలైకా స్వేచ్ఛకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది.

మలైకా ఆరోరా సమాజంలో సాధించిన విజయం, ఆమె ఆర్థిక స్వతంత్రత ముందు చాలా మంది పురుషులు అభద్రతా భావానికి గురయ్యే అవకాశం ఉందని జర్నలిస్ట్ విశ్లేషించారు. చాలా మంది పురుషులతో ఉండే అహం కారణంగా తమ కంటే ఎక్కువ విజయం సాధించిన మహిళతో ఉండటానికి ఇష్టపడకపోవచ్చు. అయితే తమ జీవితంలో స్పష్టత, భద్రతా భావం ఉన్న పురుషులు మాత్రమే మలైకా లాంటి విజయవంతమైన మహిళను భాగస్వామిగా స్వీకరించగలరు.
బాలీవుడ్ బ్యూటీ మలైకా ఆరోరా ఇండస్ట్రీలో ఓ కొత్త ట్రెండ్ ను సెట్ చేస్తున్నారని.. కేవలం బ్రాండ్ ఇమేజ్ కోసమే ఆమె ఇలా చేస్తోందనే కామెంట్లలో నిజం లేదని స్పష్టమవుతోంది. ఓ మహిళ తన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ఆమె వ్యక్తిగతమని.. వయసు కంటే కూడా ఇద్దరి మధ్య ఉండే అవగాహన, గౌరవం ముఖ్యమని అర్థమవుతోంది.




Click it and Unblock the Notifications