విశ్వక్ సేన్‌తో ఇక నటించను..హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ యంగ్ హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విభిన్న సినిమాలను చేస్తూ వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే తాజాగా ఓ హీరోయిన్ తాను ఇక మీదట విశ్వక్ సేన్‌తో నటించనని చెప్పి సంచలనం సృష్టించింది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు నివేదా పేతురాజ్.ఆ వివరాల్లోకి వెళ్తే.. హీరోయిన్ నివేత పేతురాజ్ తెలుగులో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.
చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి ఈ భామ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ముఖ్యంగా విశ్వక్ సేన్ నటించిన పాగల్, దాస్ కా ధమ్కీ , బూ సినిమాలతో క్రేజ్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు, తమిళ కన్నడ సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గా మారింది. నివేదా పేతురాజ్ విశ్వక్ సేన్‌తో కలిసి మూడు సినిమాల్లో నటించింది.ఆ సమయంలో వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి.తాజాగా ఓ ఆమె పరువు అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ వెబ్ సిరీస్‌కు పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ పాల్గొన్న నివేదా పేతురాజ్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది.

విశ్వక్‌తో మీరు మూడు సినిమాలు చేశారు.. మళ్లీ ఎప్పుడు చేస్తారు అని ప్రశ్నించింది యాంకర్. దీనిపై నివేదా పేతురాజ్ రియాక్ట్ అవుతూ.. తాను ఇక మీదట విశ్వక్ సేన్‌తో సినిమాలు చేయబోనని సరాదగా చెప్పుకొచ్చారు. విశ్వక్, నివేత ఇద్దరు 'భూ' అనే సినిమాలో నటించినప్పటికీ అందులో వీరిద్దరి కాంబినేషనలో ఎటువంటి సీన్స్ ఉండవు. ప్రస్తుతం విశ్వక్ గురించి నివేదా చేసిన ఫన్నీ కామెంట్స్ వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications