వైరల్ వీడియో: అల్లు అర్జున్ కు చేదు అనుభవం..
సాధారణంగా సెలబ్రిటీలు బయట కనపడితే ఫ్యాన్స్ గుమికూడతారు. వారితో మాట్లాడేందుకు సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడతారు. అదంతా తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ పై చూపించే ప్రేమ. కానీ ఇటీవలి కాలంలో ఫ్యాన్స్ మితిమీరి ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నటి నిధి అగర్వాల్, సమంత అలాగే దళపతి విజయ్ లకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.
తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సతీమణి స్నేహరెడ్డితో కలిసి హైటెక్ సిటీలోని నీలోఫర్ కేప్ కు వెళ్లారు. దాంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ ఎగబడ్డారు. వారితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. దాంతో బన్నీ అక్కడి నుంచి అతి కష్టం మీద బయటకు రావాల్సి వచ్చింది. కారు ఎక్కడానికి కూడా వాళ్లు చాలా ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇటీవల జూబ్లీహిల్స్ లో జరిగిన ఓ ఈవెంట్ లో సినీనటి సమంత ఇబ్బంది పడ్డారు. ఫ్యాన్స్ ఒక్కసారిగా తోసుకుంటూ రావడంతో ఆమె ఇబ్బంది పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. మరో ఘటనలో నటి నిధి అగర్వాల్ కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ అధిక సంఖ్యలో రావడంతో ఆమె ఇబ్బంది పడ్డారు.

ఇక పుష్ప 2 తో ఇండస్ట్రీ హిట్ కొట్టారు అల్లు అర్జున్. 2024 డిసెంబర్ 5 విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 1600 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. బాహుబలి 2 తర్వాత తెలుగులో ఆ రేంజ్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా చరిత్ర సృష్టించింది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్.. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు వర్కింగ్ టైటిల్ AA22xA6 గా ఫిక్స్ చేశారు. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
అల్లు అర్జున్ తన భార్య స్నేహ తో కలిసి హైటెక్ సిటీలోని కేఫ్ నీలోఫర్‌లో కనిపించారు.#AlluArjun #Sneha #HitechCity #CafeNiloufer #Hyderabad pic.twitter.com/L0n1u8EdgC
— Everest News (@Everest_News7) January 4, 2026
మరోవైపు పుష్ప 2 విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన కేసులో పోలీసులు ఇటీవల ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 23 మందిపై అభియోగాలు మోపారు. అయితే ఈ కేసు ఛార్జిషీట్ లో ఏ-11 గా అల్లు అర్జున్ పేరును చేర్చారు.












Click it and Unblock the Notifications