అల్లు అరవింద్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన యష్ తల్లి

'టాక్సిక్' సినిమా చుట్టూ నడుస్తున్న వివాదాలు, ట్రోలింగ్ కాస్తా ఇప్పుడు సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వ్యాఖ్యలు, యశ్ కుటుంబం ఇచ్చిన కౌంటర్లతో దక్షిణాది సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో యశ్ నటించిన భారీ పాన్-ఇండియా చిత్రం 'టాక్సిక్' ఇటీవల థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే, తొలి షో నుంచే సినిమాపై నెగిటివ్ టాక్ రావడం, సోషల్ మీడియా వేదికగా యశ్, దర్శకురాలిపై విపరీతమైన ట్రోలింగ్ సాగడం నడుస్తోంది. ఈ పరిణామాలపై యశ్ తల్లి పుష్ప ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తీవ్రంగా స్పందిస్తూ, మూడేళ్ల క్రితం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఊహించని రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు.

Yash mother pushpa delivers a stunning counter to producer Allu Arvind

అల్లు అరవింద్ అసలు ఏమన్నారు?

మూడేళ్ల క్రితం సినీ పరిశ్రమలో హీరోల రెమ్యునరేషన్లు, కంటెంట్ ఆదరణపై జరిగిన ఒక చర్చలో అల్లు అరవింద్ మాట్లాడుతూ- "కేజీఎఫ్ రాకముందు యశ్ ఎవరు? అతనేమైనా పెద్ద స్టార్ హీరోనా? కథను బలంగా, కంటెంట్‌ను భారీగా చూపిస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారు" అని వ్యాఖ్యానించారు. ఈ పాత కామెంట్స్ ఇప్పుడు 'టాక్సిక్' ట్రోలింగ్ నేపథ్యంలో మళ్లీ తెరపైకి వచ్చాయి. అల్లు అరవింద్ కామెంట్లతో పాటు ప్రస్తుతం జరుగుతున్న ఉద్దేశపూర్వక ట్రోలింగ్‌పై యశ్ తల్లి పుష్ప ఘాటుగా స్పందించారు.

సాధారణ నేపథ్యం

"కేజీఎఫ్ కంటే ముందే నా కొడుకు కన్నడలో వరుస హిట్లతో తన ఉనికిని చాటుకున్నాడు. అతనేమీ అమాంతం ఊడిపడలేదు, ఉగ్రవాది అంతకంటే కాదు. పేద, సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి కష్టపడి పైకొచ్చాడు." "కొందరు ఉద్దేశపూర్వకంగానే యశ్ ఎదుగుదలను చూసి భయపడుతున్నారు. డబ్బున్న కుటుంబాల నుంచి వచ్చినవారు మాత్రమే ఇక్కడ నిలబడాలా? పేదరికం నుంచి వచ్చి స్వశక్తితో ఎదిగిన కుర్రాడిని అణచాలని ఎందుకు చూస్తున్నారు?" "ఒక తల్లిగా నా కొడుకుపై జరుగుతున్న కుట్రలను చూస్తూ ఊరుకోలేను.

ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కోట్ల మంది ప్రేక్షకుల అభిమానం ఉన్నంతవరకు యశ్ ఎదుగుదలను ఎవ్వరూ అడ్డుకోలేరు." 'టాక్సిక్' సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ, దాని చుట్టూ రాజుకున్న రాజకీయాలు, అల్లు అరవింద్ వర్సెస్ యశ్ తల్లి మధ్య మొదలైన ఈ 'వారసత్వం vs స్వయంకృషి' వివాదం ఇప్పుడు కన్నడ, తెలుగు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+