ఇన్‌ స్టాలో హీరో యష్ ఫాలో అయ్యేది ఆ ఒక్కరినే.. ఆమె ఎవరో తెలుసా..?

కన్నడ స్టార్ హీరో యష్ 'కేజీఎఫ్', 'కేజీఎఫ్ 2' చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. రాకీ భాయ్ గా దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. అయితే కేజీఎఫ్ 2 అనంతరం నాలుగేళ్ల గ్యాప్ తర్వాత యష్ నుంచి వస్తున్న చిత్రం 'టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌- అప్స్‌' ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26 న విడుదల కానుంది.

అయితే ఈ మూవీ రిలీజ్ కు ముందే రికార్డులు బద్దలు కొడుతోంది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే టాక్సిక్ మూవీకి భారీ స్పందన వస్తోంది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ స్టార్ట్ అయిన కేవలం 31 గంటల్లోనే 'టాక్సిక్‌' మూవీ రూ.21 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. యష్ గత చిత్రాల విజయాల నేపథ్యంలో ఈ మూవీకి పాన్ ఇండియా స్థాయిలో మంచి ఓపెనింగ్స్ లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ట్రేడ్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక టాక్సిక్ మూవీకి మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు.

మరోవైపు యష్ పాన్ ఇండియా ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణం' లో రావణాసురుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన గ్లింప్స్ లో రావణాసురుడిగా యష్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల కానుంది. ఈ రెండు సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా యష్ భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. దాంతో ఆయన ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ భారీగా పెరిగారు. ప్రస్తుతం ఆయకు ఇన్ స్టాలో 14.6 మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే యష్ మాత్రం ఒక్కరినే ఫాలో అవుతున్నారు.

Yash toxic hero insta 14 6 million followers on Instagram but actor Yash follows only one person

ఆమె ఎవరో కాదు ఆయన సతీమణి రాధిక పండిత్.. గతంలో యష్ సినిమాల్లో రాధిక పండిత్ హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్నేళ్లు డేటింగ్ లో ఉన్నారు. 2016 లో గోవాలో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. 9 డిసెంబర్, 2016 లో యష్- రాధికల వివాహం జరిగింది. ప్రస్తుతం వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+