రూ.2 కోట్ల సినిమాకు ప్రేక్షకుల బ్రహ్మరథం,బాక్సాఫీస్ వద్ద సంచలనం..!!

గత వారం రోజులుగా సినిమా ఇండస్ట్రీలో ఏదైనా టాక్ నడుస్తోందంటే అది కేవలం కన్నడ స్టార్ యష్ నటించిన టాక్సిక్ చిత్రం గురించే. కారణాలు ఏమైనా ఉండొచ్చు... అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా విడదల రోజు నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించిన్పటికీ సినిమా మాత్రం విడుదలైన తర్వాత బొక్కబోర్లా పడింది.దీంతో ఆ చిత్ర బృందానికి కోలుకోలేని దెబ్బగా మిగిలింది.ఈ నేపథ్యంలో టాక్సిక్ సినిమాను తలదన్నుతూ మరో చిన్న సినిమా ప్రేక్షకుల మన్ననలను పొందుతోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. ఎందుకు తప్పకుండా చూడాలి..?

2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం

వెండితెరపై కొన్ని సినిమాలు ఎలాంటి హడావుడి లేకుండా వచ్చి,ప్రేక్షకుల హృదయాలను బలంగా తాకుతాయి.అలాంటి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణమే 'హనుమాన్ అన్ష్'చిత్రం.జులై 31న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా,ప్రతి ఒక్కరి కన్నీటి సుడుల మధ్య బాక్సాఫీస్ వద్ద అసాధారణమైన విజయకేతనాన్ని ఎగురవేస్తోంది. విడుదలైన తొలినాళ్లలో కలెక్షన్ల పరంగా కొంత నెమ్మదిగా కొనసాగినప్పటికీ.. ఆ తర్వాత పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఆ సినిమా కలెక్షన్ల పరంగా కూడా దూసుకెళుతోంది. కేవలం రూ. 2 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ఇప్పుడు కోట్లాది మంది గుండెలను పిండేస్తూ భక్తి సాగరంలో ఓలలాడిస్తోంది.

yashs-toxic-struggles-while-2-crore-hanuman-ansh-wins-over-audiences-with-strong-word-of-mouth

ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవిత ప్రయాణం, ఆయన సిద్ధాంతాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. 'డివైన్ డీటూర్: దట్ చేంజ్డ్ మై లైఫ్' పుస్తకం ఆధారంగా దర్శకుడు విశాల్ చతుర్వేది దీనిని గుండెకు హత్తుకునేలా తెరకెక్కించారు. శోభినావ్ సత్యా ఈ పాత్రలో అద్భుతంగా జీవించారు. పూరి శెడ్గే, పూర్ణిమ తివారీ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం, 1930 నాటి ఉత్తర భారతదేశ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది.

'టాక్సిక్' విధ్వంసం... 4 రోజుల్లోనే రాజమౌళి 'RRR' రికార్డు అవుట్!
'టాక్సిక్' విధ్వంసం... 4 రోజుల్లోనే రాజమౌళి 'RRR' రికార్డు అవుట్!

కదిలించే ఆధ్యాత్మిక చిత్రం

సినిమా చూస్తున్నంత సేపూ థియేటర్లలో కన్నీళ్లు ఆపుకోలేకపోయామని,ఏదో తెలియని దైవిక శక్తి తమను ఆవరించి ఎమోషనల్ చేసిందని ప్రేక్షకులు సామాజిక మాధ్యమాల్లో తమ అనుభూతులను పంచుకుంటున్నారు. ఈ చిత్రం కలిగిస్తున్న భావోద్వేగాలు థియేటర్లను సైతం భక్తినివాసాలుగా మార్చేస్తున్నాయి.ఈ అద్భుతమైన మౌత్ టాక్ కారణంగానే ప్రారంభంలో అంతగా గుర్తింపు లేని ఈ సినిమాకు ఇప్పుడు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

బాక్సాఫీస్ వద్ద అద్భుత సంచలనం

మొదటి రోజు కేవలం రూ. 10 లక్షల వసూళ్లతో సాదాసీదాగా ప్రారంభమైన ఈ చిత్రం, రోజురోజుకూ అనూహ్యంగా పుంజుకుంది. సాక్నిల్క్ నివేదిక ప్రకారం, ఈ సినిమా ఇప్పటికే దేశవ్యాప్తంగా రూ. 21.65 కోట్ల గ్రాస్, రూ. 18.38 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ముఖ్యంగా, సూపర్ స్టార్ యష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'టాక్సిక్' భారీ అంచనాలతో వచ్చినప్పటికీ, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. అదే సమయంలో 'హనుమాన్ అన్ష్' ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ధీటుగా దూసుకుపోతోంది.

అప్పుడే ఓటీటీలోకి 'టాక్సిక్' మూవీ.. ఎందులో చూడాలంటే..?
అప్పుడే ఓటీటీలోకి 'టాక్సిక్' మూవీ.. ఎందులో చూడాలంటే..?

ప్రముఖ సినీ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ సైతం ఈ సినిమా విజయాన్ని నమ్మశక్యం కాని అద్భుతంగా అభివర్ణించారు.ఏ విధమైన భారీ తారాగణం లేకపోయినా,కేవలం కట్టిపడేసే కథాబలం,లోతైన ఆధ్యాత్మిక సందేశంతో ఈ సినిమా బాక్సాఫీస్ విజేతగా నిలిచింది. మనసును కదిలించే దైవిక శక్తి ముందు ఎంతటి భారీ చిత్రాలైనా సాటిరావని ఇది రుజువు చేసింది. ఇది కేవలం ఒక సినిమా కాదు, భగవంతుడితో భక్తుడిని కనెక్ట్ చేసే ఒక దివ్యమైన అనుభూతి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+