‘ఎల్లమ్మ’ హీరోయిన్ విషయంలో కొత్త ట్విస్ట్?
దిల్ రాజు నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఎల్లమ్మ' ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా యంగ్ నటి అనంతిక సనిల్ కుమార్‌ను ఎంపిక చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుగు చిత్ర పరిశ్రమలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు అనంతికపై నిర్వహించిన టెస్ట్ కూడా పూర్తయిందని తెలుస్తోంది.
ఇటీవల జరిగిన టెస్ట్ షూట్‌లో అనంతిక లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ పట్ల చిత్ర యూనిట్ ఎంతో సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్టులో ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేసే విషయంలో హీరో దేవి శ్రీ ప్రసాద్ పూర్తి స్థాయిలో సుముఖంగా లేరని వార్తలు వస్తున్నాయి. అనంతిక కాస్టింగ్ విషయంలో దేవీ శ్రీ ప్రసాద్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

'8 వసంతాలు' సినిమాతో నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనంతిక, బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోయినా తన అందం, అభినయంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అంతే కాకుండా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నిర్మిస్తున్న 'రోమాంచకం' సినిమాలోనూ ఆమె నటిస్తుండటంతో సినిమా ఇండస్ట్రీలో ఆమెకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి.
ప్రస్తుతం 'ఎల్లమ్మ' చిత్ర బృందం ముందు ఒకే ప్రశ్న నెలకొంది. దేవీశ్రీ ప్రసాద్ అభ్యంతరాలను పక్కనపెట్టి మేకర్స్ అనంతికనే ఫైనల్ చేస్తారా? లేక డీఎస్పీ అభిప్రాయానికి పిలువనిచ్చి వేరే హీరోయిన్ కోసం అన్వేషణ ప్రారంభిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి టెస్ట్ షూట్‌లో ఆకట్టుకున్నప్పటికీ.. అనంతికకు ఈ సినిమాలో అవకాశం దక్కుతుందో లేదో వేచి చూడాల్సిందే.














Click it and Unblock the Notifications