పేరు మార్చుకున్న జూనియర్ ఎన్టీఆర్

సినిమాల్లో, రాజకీయాల్లో నందమూరి తారకరామారావు అనే పేరు ఒకటే ఉంది. తర్వాత సినిమాల్లో అదే పేరుతో మరో హీరోగా ఆయన మనవడు వచ్చాడు. ఉండటం కూడా అచ్చు సీనియర్ ఎన్టీఆర్ పోలికలే ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్ అనే పేరును స్థిరపరిచారు. అందుకు తగ్గట్లుగానే నటనలో నవరసాలను పండించడంతోపాటు రాజకీయాల్లో తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకి 2009 ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. ఆ తర్వాత రాజకీయాలకు విరామం ప్రకటించి కేవలం సినిమాలపైనే దృష్టిపెట్టారు.

అడుగుపెట్టబోతున్న జానకిరామ్
ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ గా పిలవబడుతున్న తారక్ పేరు ఇకనుంచి ఎన్టీఆర్ అని మారింది. జిమ్ లో వ్యాయామం చేస్తున్న సమయంలో చేతికి గాయాలైనట్లు ఒక ఫొటోను సామాజిక మాధ్యమాల్లో జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ చేశారు. అందులో మిస్టర్ ఎన్టీఆర్ అని ఉంది. ఎన్టీఆర్ టీం నుంచి అధికారికంగా వచ్చిన పోస్ట్ లో పేరును మిస్టర్ ఎన్టీఆర్ అని రాయడంతో ఇకనుంచి అదే పేరు స్థిరపరిచినట్లైంది. వయసు 40 సంవత్సరాలకు దగ్గరవుతుండటంతోపాటు పరిశ్రమలోకి తారక రామారావు పేరుతో హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరామ్ అడుగు పెట్టబోతున్నారు.

yong tiger junior ntr changed his name mister ntr

పేర్లలో అయోమయం ఉండకూడదని
ఈ పేర్లకు సంబంధించి ఎటువంటి అయోమయం ఉండకూడదనే ఉద్దేశంతో తారక్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఉన్న ఖాతాలకు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అనే ఉంది. మిస్టర్ ఎన్టీఆర్ అనే పేరు తారక్ కు సెట్ అవలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎంతమంది ఎన్టీఆర్లు పరిశ్రమలోకి ప్రవేశించినా అందరినీ జూనియర్ ఎన్టీఆర్ అని అనరని, అలా కేవలం తారక్ నే అన్నారని, జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు అతనికే సెట్ అయిందని, మిస్టర్ ఎన్టీఆర్ కన్నా జూనియర్ అనే ఉంచుకోవాలని కొందరు అభిమానులు కోరుతున్నారు. సోషల్ మీడియా ఖాతాలకు పేర్లు మారలేదు కాబట్టి అది తాత్కాలికమేనని కొందరు అంటున్నారు. చివరకు ఏ పేరును స్థిరపరుస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+