ఫంక్షన్ లో ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ ఎలాంటిదో తెలుసా?
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత వివిధ రంగాల్లోని సెలబ్రిటీలంతా ఎటువంటి దుస్తులు ధరిస్తున్నా, వస్తువులు పెట్టుకుంటున్నా అవన్నీ వైరల్ అవుతున్నాయి. దుస్తుల నుంచి వాచ్, షూ, రింగ్స్, గోల్డ్.. ఇలా ఇటువంటివాటికి సంబంధించిన వార్తలన్నీ పరిశ్రమను షేక్ చేస్తుంటాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. తాజాగా ఇలాంటి ఫొటో ఒకటి బాగా వైరలవుతోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ హాట్ టాపిక్ గా మారింది.
ఈ వాచ్ కు సంబంధించిన ఫొటోను తారక్ అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కు హాజరయ్యారు. దీనికి సంబంధించి ఆయన చేసిన స్పీచ్ కూడా వైరలైంది. ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ చాలా గ్రాండ్ గా కనిపించింది. దీని అభిమానులంతా సెర్చింగ్ చేయడం ప్రారంభించారు.

'Audemars Piguet Royal Oak Offshore' మోడల్ రకానికి సంబంధించిన వాచ్ అని తేలింది. ధర రూ.16,232,657 అని తెలుసుకున్నారు. ధర చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. తారక్ కు ఎక్కువగా కార్ల పిచ్చి ఉంది. అయితే వాచ్ లను చాలా అరుదుగా కొంటుంటాడు. వాటిని ఇష్టంగా దాచిపెట్టుకుంటుంటాడు. తన భార్య లక్ష్మీప్రణతి ఈ వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త ట్రెండింగ్ లో నిలుస్తోంది.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవర చిత్రం చేస్తున్నారు. ఇది రెండు భాగాలుగా రాబోతోంది. టిల్లు స్క్వేర్ ఫంక్షన్ లో తారక్ మాట్లాడుతూ అభిమానులంతా గర్వంగా కాలర్ ఎగరవేసుకునేలా సినిమా ఉంటుందని చెప్పారు. వేడుకలో పాల్గొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మాట్లాడుతూ నూతన తెలుగు సంవత్సరం అంతా దేవర నామ సంవత్సరంగా ఉంటుందని, సినిమా రూ.వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేయాలని అభిలషించారు.












Click it and Unblock the Notifications