జూ.ఎన్టీఆర్‌కి ప్రమాదం.. బిగ్ షాక్‌లో ఫ్యాన్స్ !!

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ షూటింగ్ సమయంలో స్వల్పంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఒక యాడ్ చిత్రీకరణలో యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్న సమయంలో కిందపడి వడంతో ఆయన కాలికి గాయం అయింది. వెంటనే వ్యక్తిగత సిబ్బంది ఆయనను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ప్రకటన..

ఈ ప్రమాదంపై ఎన్టీఆర్‌ టీమ్ ఒక ప్రకటన విడుదల చేసింది. వైద్యుల సూచనల మేరకు ఎన్టీఆర్ రెండు వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారని తెలిపింది. ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని.. అభిమానులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఎన్టీఆర్ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని కూడా కోరింది. కాగా సోషల్ మీడియాలో అభిమానులు తమ ప్రియ నటుడు త్వరగా కోలుకోవాలని కోరుతూ పోస్టులు పెడుతున్నారు.

young-tiger-ntr-injured-his-leg-while-shooting-an-advertisement

వరుస సినిమాలతో ఎన్టీఆర్..

ఇటీవలే ఎన్టీఆర్ "దేవర" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్తో కలిసి చేసిన 'వార్ 2'లో కీలక పాత్రలో మెప్పించారు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఆయన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోంది.

ప్రశాంత్ నీల్‌తో భారీ ప్రాజెక్ట్

"కేజీఎఫ్", "సలార్" సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాలు సాధించిన దర్శకుడు ప్రశాంత్ నీల్, ఇప్పుడు ఎన్టీఆర్‌తో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. గత ఏడాది పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాను 2026 చివర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్

ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా శ్రమించి సుమారు 18 కిలోలు బరువు తగ్గారు. ఆయన లుక్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం కీలక యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా, "డ్రాగన్" అనే టైటిల్ ఫిక్స్ అయ్యిందంటూ మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేసిన విషయం తెలిసిందే. అయితే గాయంతో తాత్కాలికంగా విశ్రాంతి తీసుకుంటున్న ఎన్టీఆర్ త్వరలోనే పూర్తిగా కోలుకోవాలని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+