నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ హీరోయిన్..ఆమె ఖాతాలో ఫేమస్ సింగర్ బలి
సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచమే మన చేతిలో ఉన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎక్కడ ఏం జరిగినా క్షణంలోనే సోషల్ మీడియా ద్వారా ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. అలాంటిది ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ హీరోయిన్ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకుని సంచలనం సృష్టించింది. ఆ నాలుగు పెళ్లిళ్లలో ప్రముఖ బాలీవుడ్ సింగర్ అద్నాన్ సామీ కూడా ఉండటం ఇక్కడ మరో విశేషం. పాకిస్తాన్‌కు చెందిన ఓ హీరోయిన్ ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకుని వార్తల్లో నిలిచింది. జెబా బక్తియార్ అనే పాకిస్థాన్ నటి నాలుగు పెళ్లిళ్లు చేసుకుంది.
జెబా బక్తియార్ పాకిస్తాన్ టీవీ (PTV)లో అనార్కలి అనే నాటకం ద్వారా 1988లో తొలిసారి టెలివిజన్‌లో నటించింది. 1991లో హెన్నా చిత్రంద్వారా సినీరంగప్రవేశం చేసింది. జెబా బక్తియార్ ఇండియన్ సినిమాల్లో కూడా నటించింది. జెబా భక్తియార్ మాజీ అటార్నీ జనరల్ యాహ్యా భక్తియార్ కుమార్తె. ఈమె తల్లి హంగేరియన్ దేశస్థురాలు, తండ్రి "క్వెట్టా"కు చెందిన పఠాన్ జాతికి చెందినవారు. జెబా బక్తియార్ తన వ్యక్తిగత జీవితం మరియు వివాహాల కారణంగా అనేక వివాదాలకు కేంద్రంగా నిలిచారు.

ఆమె మీద అనేక ఆరోపణలు వచ్చాయి. నాలుగు వివాహాలు ఆమెను వార్తల్లో నిలిచేలా చేశాయి. గాయకుడు అద్నాన్ సామీని వివాహం హాట్ టాపిక్‌గా మారింది. జెబా బక్తియార్ మొదటి భర్త సల్మాన్ గాలియని, రెండవ భర్త జావేద్ జాఫేరీ ,ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు అద్నాన్ సామీని జెబా బక్తియార్ మూడో వివాహం చేసుకుంది. వీరికి అజాన్ అనే కుమారుడు ఉన్నాడు. అద్నాన్ సామీతో విభేదాలు రావడంతో సోహైల్ ఖాన్ లేగారి అనే వ్యక్తిని నాలుగో పెళ్లి చేసుకుంది.జెబా బక్తియార్ తన నటనతో పాటు వ్యక్తిగత జీవితంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె జీవితం సినిమా కథలా ఉంటుంది. ఆమె పెళ్లిళ్లు ,విడాకులు, వివాదాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి.












Click it and Unblock the Notifications