Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Fact Check:ఎన్‌సీబీ విచారణ సందర్భంగా దీపికా ఆ టీషర్టు ధరించిందా..?

ముంబై: బాలీవుడ్‌ను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. ఈ సమయంలో కూడా సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వైరల్ అవుతున్న వార్తల్లో సగానికి పైగా అవాస్తవాలే. ఇలాంటి వార్తల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ శాఖ పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాజాగా డ్రగ్స్ వ్యవహారంలో పలువురు అగ్రతారలకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూర్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు అందుకున్న అగ్రతారలు వరుసగా విచారణకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ అగ్రనటి దీపికా పదుకోన్ కూడా విచారణకు హాజరైంది. ఆసమయంలో ఆమె ధరించిన టీషర్టుపై ఏమి రాసి ఉందనేదానిపై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నోటీసుల మేరకు విచారణకు హాజరైన దీపికా పదుకోన్ ధరించిన టీషర్ట్‌పై " రైతులకు మద్దతుగా ఉంటాను" అని రాసి ఉందని పేర్కొంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఎన్‌సీబీ విచారణకు హాజరైన సమయంలో రైతులకు మద్దతు ఇస్తున్నట్లుగా ఉన్న టీషర్టు ధరించారని, ఒకప్పుడు జేఎన్‌యూ వివాదం సమయంలో కూడా విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు దీపికా వచ్చిందన్న విషయాన్ని ఓ ఫేస్‌బుక్ యూజర్ పోస్టు చేశాడు.

Fact Check:No, Deepika did not wear an I support farmer T-shirt during NCB questioning

Recommended Video

    Top News Of The Day : Journalist Taken Into Custody For Passing Information To Chinese Intelligence

    అయితే ఈ ఫోటోలో వాస్తవం ఏంటనేదానిపై పరిశోధన చేయగా ఈ ఫోటోను ఫోటోషాప్ వినియోగించి మార్ఫ్ చేసినట్లు నిర్థారణ అయ్యింది. అసలు దీపికా పదుకోన్ విచారణకు టీషర్టు జీన్స్ ప్యాంట్ ధరించలేదు. ఆమె ప్లాజో ధరించి విచారణకు హాజరయ్యారు. ఈ వీడియోలను జాతీయ మీడియా సైతం టెలికాస్ట్ చేసింది. ఎన్‌సీబీ ముందుకు హాజరైన సమయంలో ఆమె మాస్కు ధరించి కనిపించారు.ఇక వైరల్ అవుతున్న ఫోటో 2018 నాటిది. ఆ సమయంలో బ్లాక్ కలర్‌లో ఉండే ప్లెయిన్ టీషర్టు జీన్స్ ధరించింది. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో తీసిన ఫోటోపై ఫోటోషాప్ వినియోగించి రైతులకు మద్దతుగా నిలుస్తాను అనే పదాలు రాశారు.

    Fact Check

    వాదన

    ఎన్‌సీబీ విచారణ సమయంలో రైతులకు మద్దతుగా ఉంటాను అని రాసి ఉన్న టీషర్ట్ ధరించిన దీపికా

    వాస్తవం

    వైరల్ అవుతున్న ఫోటో పాతది.. విచారణ సందర్భంగా దీపికా పలాజో ధరించింది

    రేటింగ్

    Misleading
    ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+