బనారస్ హిందూ యూనివర్శిటీ విజిటింగ్ లెక్చరర్లుగా నీతా అంబానీ, ప్రీతి అదానీ: రిల్ క్లారిటీ

లక్నో: ప్రఖ్యాత విశ్వవిద్యాలయం బనారస్ హిందూ యూనివర్శిటీ (BHU) విజిటింగ్ ప్రొఫెసర్లుగా దేశీయ పారిశ్రామిక దిగ్గజం, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ, అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ భార్య ప్రీతి అదానీని నియమించబోతున్నారంటూ వస్తోన్న లీకులు.. కలకలం రేపుతున్నాయి. దీనిపై విద్యార్థులు మండిపడుతున్నారు. ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. యూనివర్శిటీ గేటు వద్ద ధర్నాకు దిగారు. ఈ ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. ఈ వార్తలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాజమాన్యం స్పందించింది.

ఆ వార్తలు నిరాధారమైనవని తెలిపింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలేవీ అందలేదని స్పష్టం చేసింది. సోషల్ సైన్సెస్ విభాగం విజిటింగ్ లెక్చరర్‌గా నీతా అంబానీని నియమించాలని నిర్ణయించినట్లు బనారస్ హిందూ యూనివర్శిటీ నుంచి ఇటీవలే రిలయన్స్ ఫౌండేషన్‌కు కొన్ని ప్రతిపాదనలను పంపించినట్లు వార్తలు వెలువడ్డాయి. బీహెచ్‌యూ వైస్ ఛాన్సలర్ రాకేష్ భట్నాగర్ స్వయంగా ఆ ప్రతిపాదనలను రిలయన్స్ ఫౌండేషన్‌కు పంపించారని, నీతా అంబానీ అంగీకరించిన వెంటనే నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేస్తారనేది ఆ వార్తల సారాంశం.

Fact Check:Reports that Nita Ambani will be a visiting lecturer at BHU are fake:RIL

దీనిపై యూనివర్శిటీ విద్యార్థులు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఎలాంటి అర్హత లేని నీతా అంబానీకి విజిటింగ్ లెక్చరర్‌గా ఎలా నియమిస్తారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. క్యాంపస్ ఎదుట ధర్నా చేశారు. సోషల్ సైన్సెస్ విభాగానికి చెందిన సుమారు 40 మంది విద్యార్థులు వైస్ ఛాన్సలర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. దీనిపై వైస్ ఛాన్సలర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యం మాత్రం దీనిపై స్పందించింది. నీతా అంబానీని విజిటింగ్ లెక్చరర్‌గా నియమిస్తున్నారంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తేల్చేసింది. అలాంటి ప్రతిపాదనలేవీ రిలయన్స్ ఫౌండేషన్‌కు అందలేదని స్పష్టం చేసింది.

ప్రీతి అదానీతోపాటు లండన్‌కు చెందిన ఉక్కు పరిశ్రమ దిగ్గజం లక్ష్మీ మిట్టల్ భార్య ఉషా మిట్టల్‌ను కూడా బనారస్ హిందూ యూనివర్శిటీ విజిటింగ్ లెక్చరర్లుగా నియమిస్తారనే వార్తలపై ఆయా కంపెనీల నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. సోషల్ సైన్సెస్ విభాగం ఆధీనంలోని విమెన్ స్టడీ సెంటర్ విజిటింగ్ లెక్చరర్లుగా నియమిస్తామంటూ తాము ప్రతిపాదనలను పంపించామనే విషయాన్ని డీన్ కౌశల్ కిషోర్ మిశ్రా ధృవీకరించారు. ఫిలాంత్రోఫిక్ ఇండస్ట్రీయలిస్టులుగా వారిని తాము ఆహ్వానించామని పేర్కొన్నారు. తమ అనుభవానలను విద్యార్థినులకు పంచడం ద్వారా పారిశ్రామికవేత్తలుగా వారు ఎదగడానికి అవకాశం ఉంటుందని అన్నారు.

Fact Check

వాదన

బెనారస్ హిందూ యూనివర్శిటీలో విజిటింగ్ లెక్చరర్‌గా నీతా అంబానీ

వాస్తవం

వచ్చని వార్తల్లో నిజం లేదన్న రిలయన్స్ సంస్థ

రేటింగ్

Misleading
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+