Fact Check:భారత్‌లో ట్విటర్ పై నిషేధం..? ప్రభుత్వం ఇచ్చిన నోటీసుల్లో ఏముంది..?
ఢిల్లీ: భారత్‌లో ట్విటర్‌ను నిషేధిస్తున్నారా...? భారత్‌లో ట్విటర్‌ను నిషేధిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఉందా..? ట్విటర్‌కు భారత ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో కొత్త చర్చ జరుగుతోంది. భారత్‌లో సోషల్ మీడియా నిబంధనలు పాటించకపోతే ట్విటర్‌పై 24 గంటల్లో నిషేధం విధిస్తామంటూ వార్తలు జోరందుకున్నాయి.
అయితే గత కొన్నిరోజులుగా ట్విటర్ వేదికగా రైతు నిరసనలపై వార్తలు విస్తృతంగా ప్రచారం జరుగుతుండటంతో ప్రభుత్వం ట్విటర్‌కు నోటీసులు ఇచ్చిందనేది వాస్తవం. గణతంత్ర దినోత్సం రోజున జరిగిన హింసలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తుండటంతో వారి అకౌంట్లను నిలిపివేయడం కానీ లేదా సస్పెండ్ చేయడం కానీ చేయాలంటూ ప్రభుత్వం నోటీసుల్లో పేర్కొంది.

బుధవారం ట్విటర్‌కు ఇచ్చిన నోటీసుల్లో చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేసింది ఐటీ మంత్రిత్వ శాఖ. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు జరిగిన ట్వీట్స్‌ను తొలగించాలని లేదంటే జైలుశిక్ష లేదా భారీ జరిమానా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే కొన్ని ట్విటర్ అకౌంట్స్‌ను సస్పెండ్ చేసిన ట్విటర్ యాజమాన్యం కొన్ని గంటల తర్వాత తిరిగి వాటిని యాక్టివేట్ చేసింది.
అయితే ప్రభుత్వం ట్విటర్‌ను మరోమారు హెచ్చరించింది. దీంతో ట్విటర్ మొత్తం మూడు ఖాతాలను సస్పెండ్ చేసింది. అందులో సంయుక్త్ కిసాన్ మోర్చా, ట్రాక్టర్ టూ ట్విటర్, మరియు బీకేయూలు సస్పెండ్‌కు గురయ్యాయి.ఇదిలా ఉంటే ట్విటర్‌పై చర్యలు తీసుకునేందుకు భారత ప్రభుత్వం పావులు కదుపుతోందనే విషయం వాస్తవమే. అయితే నిషేధం విధించాలన్న అంశంపై మాత్రం ఎక్కడా స్పష్టత లేదు. ఒకవేళ ట్విటర్ చర్యలు తీసుకోకపోతే జైలు శిక్ష లేదా భారీ జరిమానాను ఎదుర్కోవాల్సి ఉంటుందని మాత్రమే నోటీసుల్లో పేర్కొంది. అంతే తప్ప ఏకంగా ట్విటర్‌నే నిషేధించాలన్న ఆలోచన మాత్రం ప్రభుత్వం చేయడం లేదు.

Fact Check
వాదన
ప్రభుత్వం ట్విటర్‌ను భారత్‌లో నిషేధిస్తోంది
వాస్తవం
చర్యలు తీసుకోకుంటే జైలు శిక్ష లేదా భారీ జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుందన్న ప్రభుత్వం
రేటింగ్
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..!












Click it and Unblock the Notifications