బెంగళూరులో కలకలం రేపిన బెంగాల్ అల్లర్ల వీడియో: గ్యాంగ్‌ రేప్‌తో లింకు: అసలు విషయమేంటీ?

బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరు అల్లర్ల సందర్భంగా ఓ వీడియో కలకలం రేపింది. అల్లరి మూకలు పోలీసులు, భద్రతా బలగాలపై యథేచ్ఛగా రాళ్లదాడికి పాల్పడటం, వెంటపడి రాళ్లు రువ్వడానికి సంబంధించిన వీడియో అది. దీనికి ప్రతిగా భద్రతా బలగాలు అల్లరిమూకలపై కాల్పులు జరపడం ఈ వీడియో రికార్డు అయ్యాయి. కొద్దిరోజుల కిందట ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హల్‌చల్ చేసింది. బెంగళూరులో ఒక వర్గానికి చెందిన యువత.. ఎలాంటి దారుణాలకు పాల్పడుతోందో చూడండి అనే క్యాప్షన్‌తోను గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియోపై పోలీసులు అసలు విషయాన్ని వెల్లడించారు. అందులో రికార్డయిన అల్లర్లు బెంగళూరులో చోటు చేసుకున్నవి కావని తేల్చి చెప్పారు. బెంగళూరులో సంభవించిన అల్లర్లు.. దానికి ఏ మాత్రం సంబంధం లేదు. ఆ సంఘటన నిజమే అయినప్పటికీ.. దానికి, బెంగళూరు అల్లర్లకు ఎలాంటి సంబంధమూ లేదని తేలింది. కిందటి నెల 19వ తేదీన రికార్డు చేసినట్లుగా భావిస్తోన్న ఈ వీడియో పశ్చిమ బెంగాల్‌కు సంబంధించినదని నిర్ధారితమైంది. ఈ దాడులకు సంబంధించిన కొన్ని ఫొటోలను అప్పట్లోనే ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఎఎన్ఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దింజాపూర్‌ సమీపంలోని కలగచ్ఛ్ ప్రాంతంలో చోటు చేసుకున్న అల్లర్లకు సంబంధించిన వీడియో అది. కలగచ్ఛ్‌లో ఓ మహిళ సామూహిక అత్యాచారానికి గురయ్యారు. దీనికి నిరసనగా స్థానికులు నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. తమ నిరసనలో భాగంగా బాధిత మహిళ కుటుంబీకులు, ఆందోళనకారులు ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు. దీనితో ప్రభుత్వం అదనపు పోలీసు బలగాలను మోహరింపజేసింది. ఈ సందర్భంగా ఆందోళనకారులు, భద్రతా బలగాల మధ్య పెద్ద ఎత్తున దాడులు, ప్రతిదాడులు చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులు పలు వాహనాలను తగులబెట్టారు.

Fake: Viral video of violence is from West Bengal, not from Bengaluru

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బెంగళూరులో చోటు చేసుకున్నట్లుగా పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బెంగళూరులో పులకేశి నగర ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస మూర్తి నివాసంపై అల్లరి మూకలు దాడులకు పాల్పడ్డారు. ఆయన నివాసాన్ని తగులబెట్టారు. కేజీ హళ్లి, డీజే హళ్లి పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి, పోలీసు వాహనాలను తగులబెట్టారు. ఈ సందర్భంగా పోలీసులు అల్లరిమూకపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ఆదే సమయంలో బెంగాల్‌లో చోటు చేసుకున్న దాడులకు సంబంధించిన వీడియోను బెంగళూరులో సంభవించినట్లుగా చూపారు. అది నిజం కాదని తేల్చారు పోలీసులు.

Fact Check

వాదన

వీడియోలో కనిపిస్తున్న అల్లర్లు బెంగళూరులో జరిగినవి

వాస్తవం

ఈ వీడియోలోని దృశ్యాలు బెంగళూరుకు చెందినవి కావు, పశ్చిమ బెంగాల్‌లోని ఘటనవి.

రేటింగ్

Misleading
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+