Fact check : ఆ ఫోటో ఫేక్-నీతా అంబానీకి వంగి నమస్కరిస్తున్న మోదీ...

ప్రసార భారతి మాజీ సీఈవో జవహర్ సిర్కార్ చేసిన ఓ ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. సిరక్కార్ పోస్టు చేసిన ట్వీట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీకి వంగి నమస్కారం పెడుతున్న ఫోటో ఉన్నది. దానికి సిర్కార్ తన వ్యాఖ్యలను జతచేశారు.

'పరిణతి చెందిన ప్రజాస్వామ్యంలో ఇరువురి మధ్య సంబంధం, సహాయాలు,లావాదేవీలు మనకు తెలుస్తాయి. ఏదో ఒకరోజు చరిత్ర మనకు చెబుతుంది.' అని సిర్కార్ ట్వీట్ చేశారు. అయితే సిర్కార్ చేసిన ఫోటో మాత్రం ఫేక్ అని తేలింది. నిజానికి అది గతంలో దీపికా మండల్ అనే ఓ మహిళా ఎన్జీవోకి మోదీ విషెస్ చెప్తున్న ఫోటో. కానీ దీపిక మండల్ స్థానంలో నీతా అంబానీ ఫోటో మార్ఫింగ్ చేశారు. సిర్కార్ కూడా అదే ఫోటోను తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

Former Prasar Bharti CEO shares morphed image of PM Modi bowing before Nita Ambani

గతంలో ఇదే ఫోటోను ప్రముఖ వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ భార్య ప్రీతి ఆదానీ ఫోటోతోనూ మార్ఫింగ్ చేశారు. చాలాకాలంగా ఈ మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ప్రసార భారతికి సీఈవోగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి ఫేక్ ఫోటోలను పోస్టు చేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత ప్రసార భారతి సీఈవో శశి శేఖర్ సిర్కార్ చేసిన ట్వీట్‌ను తప్పు పట్టారు.ఇది సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు.

విమర్శల నేపథ్యంలో ఎట్టకేలకు సిర్కార్ ఆ ట్వీట్ తొలగించారు. అయితే అలాంటిదే మరో ఫోటోను ఆయన తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. నిజానికి ఈ ఫోటోల్లో ఫేక్ కానిది ఏంటంటే... ఈ సంపన్న గుజరాతీలతో మోదీకి ఉన్న బంధం... ఆయన పాలనలో వారు నమ్మశక్యం కాని రీతిలో ఎదగడం.. అని ట్వీట్ చేశారు.

Former Prasar Bharti CEO shares morphed image of PM Modi bowing before Nita Ambani

సిర్కార్ మోదీ ప్రభుత్వంపై వ్యతిరేక స్వరం వినిపించడం ఇదే తొలిసారి కాదు. కుట్రపూరితంగా ప్రసారభారతి స్వతంత్ర స్థాయిని దెబ్బతీశారని గతంలో ఆయన ఆరోపించారు. ఏళ్లుగా ప్రసారభారతి బోర్డును ఏర్పాటుచేయకుండా, కావాలనే కేంద్రం కాలయాపన చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Fact Check

వాదన

నీతా అంబానీకి వంగి నమస్కరించిన ప్రధాని మోదీ

వాస్తవం

అది మార్ఫింగ్ ఫోటో. గతంలో దీపికా మండల్ అనే మహిళా ఎన్జీవోకి మోదీ నమస్కరించిన ఫోటో. అందులో దీపికా స్థానంలో నీతా అంబానీ ఫోటోతో మార్ఫింగ్ చేశారు.

రేటింగ్

Misleading
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+