కెసిఆర్ ముందడుగు

తెలంగాణ ఉద్యమ పార్టీల ఐక్యతకు ప్రాతిపదిక ఏర్పడుతున్నది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చొరవ చూపి పార్టీల మధ్య ఐక్యతకు పునాదులు వేస్తున్నారు. తల్లి తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు విజయశాంతితో కెసిఆర్ జరిపిన చర్చలు ఫలించాయి. ఒకటి రెండు రోజుల్లో చంద్రశేఖరరావుతో కలిసి విజయశాంతి సంచలనమైన ప్రకటన చేస్తారని అంటున్నారు. నవ తెలంగాణ ప్రజాపార్టీ (ఎన్టీపిపి) నాయకుడు టి. దేవేందర్ గౌడ్ తో కూడా మాట్లాడ్తానని చంద్రశేఖరరావు చెప్పారు. ఇది తెలంగాణ ఉద్యమానికి సంబంధించినంత వరకు ఆహ్వానించదగిన పరిణామం. దేవేందర్ గౌడ్ కూడా చంద్రశేఖరరావు చొరవకు అనుకూలంగా ప్రతిస్పందించాల్సి ఉంటుంది. అప్పుడే ఆయనకు తెలంగాణ ప్రజల నుంచి మద్దతు లభిస్తుందనే విషయం గుర్తించాల్సి ఉంటుంది.

ఇదిలా వుంటే, తెలంగాణ ఉద్యమ పార్టీలను, సంస్థలను ఏకం చేయడానికి ఆదివారంనాడు ఈ నెల 14వ తేదీన ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏకీకరణకు ప్రతిపాదనలు పెట్టే కన్నా తెరాసపై విమర్శలు చేయడానికే కొంత మంది ప్రాధాన్యం ఇచ్చారు. అలాంటి విమర్శలు చేసినవారి ముఖ్యమైన ఆక్షేపణ - తెరాసలో సామాజిక న్యాయం లేదనేది. నిజానికి, చెప్పాలంటే సామాజిక న్యాయ సూత్రాన్ని పూర్తిగా ఆమోదిస్తున్నది తెలంగాణ సంస్థలే. తెలంగాణను మోసం చేశారని ఇప్పుడే కెసిఆర్ మీది విమర్శలు పెట్టడం కూడా సరైంది కాదు. ఆయనను ప్రజలు నిర్దేశిస్తున్నారనే విషయాన్ని విస్మరించకూడదు. అలాగే, తెలంగాణ ఉద్యమ పార్ట్లీల్లో గానీ, సంస్థల్లో గానీ సామాజిక న్యాయసూత్రాన్ని పాటించాలనే అంశాన్ని అంతర్గత చర్చకు పెడితే మంచిది. ఆ చర్చను తెరాస కూడా ఆహ్వానిస్తుంది. ఆదివారంనాటి సమావేశంలో ఏకీకరణ కోసం ప్రతిపాదనలు పెట్టే వారిలో తెరాస ప్రతినిధి కూడా ఉన్నారు. వేదిక మీదికి పిలిచి అవమానించడం వల్ల ఏకీకరణకు ప్రాతిపదిక ఏర్పడదు. పరస్పర గౌరవ భావంతోనే ఏకీకరణ అనేది సాధ్యమవుతుంది. పైగా, ఉప ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పోటీ చేసినవారు ఏకీకరణకు పిలుపునిస్తే కూడా కాదనకుండా కెసిఆర్ తన ప్రతినిధిని సమావేశానికి పంపారు. ఈ విషయాన్ని వక్తలు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏకీకరణ జరగాలనే చిత్తశుద్ధి ఉంటేనే పరస్పర గౌరవ భావన అనేది ఉంటుంది.

తెలంగాణ శక్తుల ఏకీకరణ దిశగా ఉమ్మడి కార్యాచరణ కోసం ఈ నెల 28వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలోనైనా శత్రుపూరిత వైఖరితో కాకుండా మిత్రపూరిత వైఖరితో వ్యవహిరిస్తారని ఆశిద్దాం. చంద్రశేఖరరావును వ్యతిరేకించేవారు, ఆ తర్వాత ఏకీకరణకు సమావేశాలు పెట్టే వారు ఒకరే కావడం, దాన్ని కూడా చంద్రశేఖర రావు గౌరవించడమనే విషయాన్ని ఎలా చూస్తారనేది కూడా ముఖ్యమే అవుతుంది. ఇంత కాలం తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టిన ఘనత, తెలంగాణ అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చకు పెట్టిన చరిత్ర, ఇవాళ తెలంగాణ గ్రామాల్లో ప్రజలు శిరసెత్తుకుని తిరగడానికి అనువైన వాతావరణాన్ని కల్పించిన రాజకీయ కార్యాచరణ ఫలితం చంద్రశేఖరరావుకే దక్కుతుంది.

వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ ఉద్యమ సంస్థలను పక్కన పెట్టైనా సరే, తెలంగాణ ఉద్యమ పార్టీలు ఒక అవగాహనకు రావాల్సిన అవసరం ఉంది. వామపక్షాలు ముందు ఒక అవగాహనకు వచ్చి ఇతర పార్టీలతో సర్దుబాటుకు సిద్ధం కావడం చాలా కాలంగా చూస్తూనే ఉన్నాం. తెలంగాణ ఉద్యమ పార్టీలు కూడా ఈ విధానాన్ని అనుసరించడం తెలంగాణ ఉద్యమానికి అత్యంత అవసరమైన పరిణామం. గత ఎన్డియె పాలనలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ అడ్డు పడిన మాట వాస్తవమే. ఈ విషయాన్ని బిజెపి అగ్రనేత ఎల్.కె. అద్వానీ తమ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు ప్రసంగంలో చెప్పారు. అయితే తెలుగుదేశం పార్టీ తన వైఖరిని మార్చుకుని ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణకు పూర్తి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే తెలుదేశంపార్టీతో తెలంగాణ ఉద్యమ పార్టీలు పొత్తు పెట్టుకోవడమే మంచిది. చిరంజీవి ప్రజారాజ్యంతో కూడా ఆ పార్టీ తెలంగాణకు పూర్తి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటేనే పొత్తుకు సిద్ధపడాలి. కేవలం సామాజిక న్యాయసూత్రం మంత్రం సిరపోదు. తెలంగాణ పార్టీల్లో సామాజిక న్యాయ సూత్రం అమలయ్యే విధానాన్ని మనం అమలు చేసుకునే పరిస్థితులను కల్పించుకోవడం అవసరం. కాంగ్రెస్ కూడా తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రకటనను ప్రజలను నమ్మే స్థితిలో లేరు. కాబట్టి తెలంగాణలో కాంగ్రెసును ఏకాకిని చేయడం ఎంతైనా అవసరం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+