వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువతకు గోల్డెన్ ఛాన్స్: ఎఫ్‌సిఐలో ఖాళీలు

|
Google Oneindia TeluguNews

భారత ఆహార సంస్థ(ఎఫ్‌సిఐ) 2015 సంవత్సరానికి గానూ జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ గ్రేడ్-II(Hindi), అసిస్టెంట్ గ్రేడ్-III, టైపిస్ట్ (హిందీ) పోస్టులకు గాను దరఖాస్తులు కోరుతోంది. పై పోస్టులకు గాను నోటిఫికేషన్ గత వారం వెలువరించబడింది. మొత్తం ఖాళీల సంఖ్య-

1. జూనియర్ ఇంజినీర్ - 78
2. అసిస్టెంట్ గ్రేడ్ - II/అసిస్టెంట్ గ్రేడ్-III -4130
3. టైపిస్ట్(హిందీ) -100

ఇందులో సౌత్ జోన్‌కు కేటాయించిన పోస్టుల సంఖ్య

1. జూనియర్ ఇంజినీర్ - 13
2. అసిస్టెంట్ గ్రేడ్ - II/అసిస్టెంట్ గ్రేడ్-III -1158
3. టైపిస్ట్ (హిందీ) -23

నోటిఫికేషన్‌లో ప్రచురించబడిన ఇతర విషయాల కోసం, ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం.. http//fcijobsportal.comకి లాగిన్ కండి.

ఈ పరీక్షలు అన్నింటినీ భారత ఆహార సంస్థ(FCI) సొంతంగా నిర్వహిస్తుంది.

పరీక్ష విధానం:

భారత ఆహార సంస్థ(FCI) వెలువరించిన నోటిఫికేషన్ ప్రకారం కొన్ని పోస్టులకు ఒక్క పరీక్ష(పేపర్), కొన్ని పోస్టులకు రెండు పరీక్షలు(పేపర్లు) విధానం ఉంది.

 FCI releases jobs notification

ఒక్క పేపర్ పరీక్ష విధానం ఉన్న పోస్టులు:

1. ఏజి-III(జనరల్)
2. ఏజి-III(డిపోట్) ఈ రెండింటికీ ఒక పేపర్ మాత్రమే.

రెండు పేపర్ల పరీక్ష విధానం ఉన్న పోస్టులు:

1. జూనియర్ ఇంజినీర్ (సివిల్)
2. జూనియర్ ఇంజినీర్(ఎలక్ట్రికల్)
3. జూనియర్ ఇంజినీర్ (మెకానికల్)
4. ఏజి-III(అకౌంట్స్)
5. ఏజి-III(టెక్నికల్) ఈ ఐదింటికీ పేపర్ I, II ఉంటాయి.

6. ఏజి-II (హిందీ) - పేపర్ III, పేపర్ IV

పైన పేర్కొనబడిన పేపర్ I, పేపర్ II, పేపర్ III, పేపర్ IVలు అన్ని ఒక్క రోజే నిర్వహించబడుతాయి.

అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్ టైప్ (Multiple choice questions) రూపంలో ఉంటాయి.

Paper-I

ఇందులో 120 ప్రశ్నలు ఉంటాయి. ఈ 120 ప్రశ్నలను 90 నిమిషాల సమయంలో పూర్తి చేయాలి. పేపర్ Iలోని ముఖ్య అంశాలు

1. Reasoning
2. Data analysis
3. English Language
4. Computer Proficiency
5. General Awareness
6. General Interlligence
7. Current Events
8. Numerical Ability
9. Data Interpretation

Paper-II

ఇందులో 120 ప్రశ్నలు ఉంటాయి. కేటాయించిన సమయం 90 నిమిషాలు.

- civil/electrical/mechanical engineering పోస్టులకు ఆయా సబ్జెక్టులపై ప్రశ్నలుంటాయి.

- Assistant Grade III (Accounts) పోస్టులకు కామర్స్, జనరల్ అకౌంటింగ్, ఫైనాన్స్ విషయాలపై ప్రశ్నలుంటాయి.

- Assistant Grade III(Technical) పోస్టులకు జీవశాస్త్రం (Biological sciences)పై ప్రశ్నలు ఉంటాయి.

Paper III

ఇందులో 120 ప్రశ్నలు ఉంటాయి. కేటాయించిన సమయం 90 నిమిషాలు
ఈ పేపర్ లోని ముఖ్య అంశాలు:

1. General Hindi
2. General English
3. General Awareness
4. General Intelligence
5. Computer Knowledge

Paper IV

ఈ పేపర్‌కు కేటాయించిన సమయం 90 నిమిషాలు
ఇందులో రెండు వ్యాసాలు ఇచ్చి English - Hindi లేదా Hindi - English అనువాదం చేయమని అడుగుతారు.

పై పేపర్లలో సాధించిన మెరిట్ ప్రాతిపదికన 1:10 నిష్పత్తిలో స్కిల్ టెస్ట్ (skill test)కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్షకు సన్నద్ధం కండి ఇలా...

FCI నోటిఫికేషన్‌ను, పరీక్ష విధానాన్ని, పరీక్షించనున్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఈ అంశాలు ఇంచుమించు అన్ని సాధారణ పోటీ పరీక్షల అంశాలను పోలి ఉన్నాయి. Technical, Accounts, Engineering పోస్టుకు దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులు మాత్రం వారి సంబంధిత సబ్జెక్టులపై దృష్టి సారించాలి.

సాధారణ పోస్టుకు దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొనబడిన అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. Reasoning, English, Numerical Ability, Aptitude పైన ప్రతి అంశాన్ని అవపోసన చేయాలి. రోజువారీగా వీలైనన్న ఎక్కువ మాదిరి ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి.

General Awareness, Current Events కోసం దిన పత్రికలను, మ్యాగజిన్స్‌ను ఒక ప్రణాళిక బద్దంగా చదవాలి. ఆరు నెలల current affairsపై పట్టు సాధించాలి. ప్రతి అంశాన్ని చాలా లోతుగా విశ్లేషిస్తూ అధ్యయనం చేయాలి.

ఇక్కడ ప్రశ్నల సంఖ్య, కేటాయించిన సమయం తక్కువ కావున, ప్రశ్నలు ఎక్కువ సంఖ్యలో ఏ అంశముపైన అడుగుతారో అంచనా వేయడం కష్టం. కావున ప్రతి అంశాన్ని సమపాళ్లలో అధ్యయనం చేయాలి.

అంశాలపై లోతైన అధ్యయనం చేస్తూ, ప్రణాళిక బద్దంగా చదివి, వీలైనన్ని మాదిరి ప్రశ్నలను ప్రాక్టీస్ చేస్తూ ఈ పరీక్షకు సన్నద్ధం అయితే.. తుథి ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది.

- హర్షవర్ధన్

English summary
A banking expert Harashavardhan Erra is explaining about jobs in FCI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X