శతృఘ్ను ప్రతిపాదన: ఒక్క తాను ముక్కలే

కాగా; ఈ జాతీయ ప్రభుత్వ ఆలోచనకు, కారణాలుగా శత్రుఘ్ను సిన్హా కొన్ని వాదనలను ముందుకు తెచ్చారు. అవి, ఈ విధంగా బిజెపి-కాంగ్రెస్ లతో జాతీయ ప్రభుత్వం ఏర్పడని పక్షంలో- ఈ జాతీయ పక్షాలు ప్రభుత్వాల ఏర్పాటుకై- ప్రాంతీయ పార్టీలపై ఆధార పడవలసి వస్తోంది. తద్వారా ఏర్పడుతున్న ప్రభుత్వాలు-జాతీయ దృక్పథంతో పని చేయలేకపోతున్నాయి. ప్రాంతీయ పార్టీల ఒత్తిడిల వలన, జాతీయ స్థాయి అజెండా దెబ్బ తింటుంది. దీనికి తార్కాణంగా; శత్రుఘ్ను సిన్హా- నిన్నా మొన్నటి, శ్రీలంకలో జరిగిన కామన్ వెల్త్ సమావేశాల ఉదంతాన్ని ముందుకు తెచ్చారు. కేవలం తమిళనాడుకు చెందిన కొన్ని రాజకీయ పక్షాల ఒత్తిడి వలన మన దేశ ప్రధాని, ఈ సమావేశాలలో పాల్గొనకుండా ఆగిపోవాల్సి వచ్చిందనేది దీని సారాంశం. ఇది నిజమే. అరుదైన కొన్ని సందర్భాల్లో ఇటువంటి రాజీలు జరిగాయి. వాస్తవానికి, ఈ రాజీలు ఏమంత సంతోషకరమైనవి కావు.
కానీ, నిజానికి బిజెపి నేత శత్రుఘ్ను సిన్హా మాట్లాడని మరెన్నో అంశాలు, ఈ జాతీయ ప్రభుత్వ ప్రతిపాదన వెనకన ఉన్నాయి. వాస్తవానికి ఈ అంశాలే నేడు బిజెపి-కాంగ్రెస్ ల జాతీయ ప్రభుత్వ ఆలోచనకు మూలకారణం. జాతీయ, అంతర్జాతీయ విధానాలలో బిజెపి-కాంగ్రెస్ ల మధ్యన భావసారూప్యత ఉందని కూడా తన మాటల్లో శత్రుఘ్ను సిన్హా పేర్కొనడం ఇక్కడ గమనార్హం. అంటే; జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక-రాజకీయ అంశాల విషయంలో ఈ రెండు ‘జాతీయ' పార్టీల విధానాలకూ సంబంధించి, వాటి మధ్యన ఎటువంటి తేడాలు లేవు. అవి రెండూ, జాతీయ స్థాయిలో- సరళీకరణ, ప్రపంచీకరణలనే నయా ఉదారవాద విధానాలను వంతులవారీగా భుజాన మోస్తున్నాయి. ఈ కారణంగానే బిజెపి పాలక పక్షంగా ఉన్న ఎన్డీఏ పాలనా కాలంలో- ప్రభుత్వరంగ పరిశ్రమల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు గాను అరుణ్ శౌరి నేతృత్వంలో ఒక పూర్తిస్థాయి మంత్రిత్వ శాఖే ఉంది. ఇక, నేటి యూపిఏ(కాంగ్రెస్ ఆధారిత) పాలనలో కూడా ప్రభుత్వ రంగంలోని వాటాల ఉపసంహరణది పెద్ద పీటే.
కాగా; దేశంలో జరుగుతోన్న అన్ని రకాల ధనిక దేశాల(ముఖ్యంగా అమెరికాకు) అనుకూల సంస్కరణల విషయంలోనూ బిజెపి-కాంగ్రెస్ పార్టీల మధ్యన అట్టే తేడా లేదు. ఒక్క రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశంలో మినహాయిస్తే, బిజెపి నేతలు, కాంగ్రెస్(యూపిఏ) చేసిన ఏ నిర్ణయాన్ని పెద్దగా ప్రతిఘటించలేదు. దీనికి కారణం సరళం. ఒక రాజకీయ పక్షంగా, బిజెపి ఓటు బ్యాంకులోని కీలక వాటా-మన దేశంలోని వ్యాపార వర్గాలది. ఈ కారణం చేత; రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సమర్థించి, 4.5కోట్ల మంది భారతీయ చిరు దుకాణాదారుల ఆగ్రహానికి గురికావడం బిజెపి నేతలకు సహజంగానే ఆందోళన కలిగించే విషయం.
ఇక; పింఛన్ రంగ ‘సంస్కరణలూ', బీమా రంగ ‘సంస్కరణలు'. మనదేశీయ రక్షణ రంగంలో సైతం ప్రవైటు పెట్టుబడులూ, విద్యా రంగంలో విదేశీ విశ్వవిద్యాలయాలకు అనుమతి, మరో హరిత విప్లవం పేరిట వ్యవసాయ రంగంలో కార్పొరేట్ సంస్థలకు అగ్ర తాంబూలాన్ని కల్పించి, తద్వారా కార్పొరేట్ వ్యవసాయానికి తెర తీయడం వంటి అనేక నయా ఉదారవాద ఆర్థిక 'సంస్కరణల‘ విషయంలో బిజెపి-కాంగ్రెస్ పార్టీల నడుమన ఎటువంటి తేడా లేదన్నది జగమెరిగిన సత్యం. నిజానికి; ఈ రెండు పార్టీల నేతృత్వంలోని కూటములైన ఎన్డీఏ-యూపిఏల గత, వర్తమాన పాలనలను పరిశీలిస్తే మనకు కనపడేది ఈ నిష్టుర సత్యమే. వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన తొలి దఫా 13రోజుల పాలనా కాలంలోనే-అధికారం చేజారిపోక ముందరే-అంతకు ముందర తాము తీవ్రంగా వ్యతిరేకించిన ఎన్రాన్ కు సంబంధించిన బిల్లుపై సంతకం చేయడం, ఇక్కడ మరువరాదు. అలాగే; అనంతరం 2004 వరకూ నడిచిన తన పాలనా కాలంలోనూ బిజెపి అనుసరించిన విధానాలు, నేటి యూపిఏ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక నయా ఉదారవాద విధానాలకు ఏ మాత్రం తీసిపోవు.
ఉదాహరణకు 2002లో నాటి ఎన్డీఏ ప్రభుత్వం, అప్పటికే పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో ఉన్న ‘నియంత్రిత ధరల విధాన' స్థానంలో ‘దిగుమతుల ఆధారిత ధరల విధానా'న్ని ప్రవేశపెట్టింది. ఈ నూతన విధాన ఫలితంగానే నాటి నుంచి నేటి వరకు పెట్రోలియం, డీజిల్ ధరలూ, అలాగే వంట గ్యాస్ ధరలు రోజు రోజుకు పెరుగుదలకు గురవుతున్నాయి. కానీ నేడు యూపిఏ ఈ ధరలను పెంచినప్పుడల్లా అత్యంత 'అమాయకంగా‘ ప్రతిపక్ష బిజెపి నేతలు, ఈ ధరల పెంపులను ఖండిస్తూ ఉంటారు. అందుచేతనే-'భారత్ వెలిగిపోతోంది‘ అంటూ 2004లో ఎన్నికల గోదాలోకి దిగిన బిజెపి(ఎన్డీఏ)ని దేశ ప్రజలు చిత్తుగా ఓడించారు. నేడు, 2014 ఎన్నికలలో ఈ పరాజయం పొందే వంతు కాంగ్రెస్(యూపిఏ)కు దక్కనుంది.
ఈ క్రమంలోనే దేశంలో కార్పొరేట్ ల అనుకూల, ధనికుల కొమ్ము కాసే నయా ఉదారవాద విధానాలు ముందు ముందు సరిగా అమలు జరగవేమోననే ఆందోళనతోనే బిజెపి-కాంగ్రెస్ నేతలు బహుశా నేడు జాతీయ ప్రభుత్వం గురించి ఆలోచిస్తూ ఉండి ఉండవచ్చు. దాంతో; పలువురు వ్యాఖ్యాతలు టీమ్-ఏ, టీమ్-బిలుగా పిలిచే ఈ రెండు పక్షాలు నేడు, తమ ముసుగులు తీసేసి ఒకే వేదికపైకి జాతీయ ప్రభుత్వంగా ఆశించడం ఆశ్చర్యకరమేమి కాదు. నిజానికి, 2010-11లో భారత్ కు సంబంధించిన వికీలీక్స్ కు చెందిన రహస్య పత్రాలు కొన్నింటిని-మన దేశీయ పత్రిక అయిన ‘ది హిందూ' కొంత కాలంపాటు రోజువారీ ప్రచురించింది. వీటిని మనం పరిశీలించినా, పై వాదనలకుగాను మనకు సాక్ష్యాలు లభిస్తాయి. నిజానికి; ఈ వికీలీక్స్ వెలువరించిన రహస్య పత్రాలలో-మన బిజెపి నేతలు విదేశీ దౌత్య వేత్తలతో మాట్లాడిన అంశాలకు సంబంధించినవి కూడా అనేకం ఉన్నాయి. వాటి ప్రకారంగా; కొందరు బిజెపి నేతలు-ఒక పక్క వివిధ వేదికలపై అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే, మరో పక్కన అమెరికా దౌత్య వేత్తలతో-తమ మాటలను సీరియస్ గా తీసుకోవద్దంటూ, ప్రతిపక్షంగా తమకది తప్పదనే తరహాలో విన్నవించుకోవడం జరిగిందట.
అదీ విషయం. అంటే; కేవలం తాను ప్రతిపక్షంలో ఉంది గనుక బిజెపి-కాంగ్రెస్ నూ, దాని అమెరికా బహుళజాతి సంస్థల, కార్పొరేట్ల అనుకూల విధానాలనూ విమర్శిస్తుంది. అలాగే; తాను ప్రతిపక్షంగా ఉంటే కాంగ్రెస్ కూడా ఇదే తీరులో వ్యవహరిస్తుందన్న మాట. ఇక; తిరిగి తామే ఎన్నికల్లో అధికారంలోకి గనక వస్తే, మరలా కథ మామూలే. తాము నిన్నటి వరకు చేసిన గాలి మూటల యుద్ధాన్ని పక్కన పెట్టి, అసలు సిసలు నయా ఉదారవాదాన్ని అమలు జరిపే భారాన్ని వారు భుజాన వేసుకుంటారు.
దీనికి మరో చిన్న మచ్చుతునకే, గతంలో మన దేశ అధ్యక్షునిగా ఉన్న అబ్దుల్ కలాం ఒక సందర్భంలో మాట్లాడిన మాటలు. ఎన్నికల రాజకీయాలు వేరు, ఎన్నికల అనంతర రాజకీయాలు వేరనేది-అబ్దుల్ కలాంగారి మాటల సారాంశం. అంటే; ఎన్నికల్లో ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకూ, ప్రజల నుంచి ఓట్లు రాబట్టుకునేందుకు గాను, రకరాల విమర్శలు చేసుకోవచ్చును. కానీ, ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం-ప్రజా వ్యతిరేక సంస్కరణలను అమలు జరపడంలో- పాలక, ప్రతిపక్షాలు అన్నీ ఒక్కటిగా నిలబడాలి!!! అదీ కథ. 'వాషింగ్టన్ కన్సెన్సస్‘ అనే ఏకీభావ భావన ప్రాతిపదికన-నయా ఉదారవాద విధానాలను మనదేశంలో అమలు జరిపే భారాన్ని తమ భుజాలపై వేసుకున్న అన్ని రాజకీయ పక్షాల అజెండా ఒక్కటేనన్నది దీని సారాంశం. ఈ అజెండాకు కట్టుబడని-ప్రతిపక్షాలు(వామ పక్షాల వంటివి) ఏవైనా ఉంటే-అవి తమకు కంట్లో నలుసులా ఉన్నాయనే కంటగింపు నుంచి వస్తోన్న పాలకుల వాదనలివి.
కాబట్టి, ముందు ముందు ఈ కంట్లో నలుసు పక్షాలు, పార్లమెంటులోనే మెజార్టీగా తిష్టవేసి-దేశానికి పట్టిన నయా ఉదారవాద భూతాన్ని వదలగొడతారేమోననేది-నేటి బిజెపి-కాంగ్రెస్ (వారి అంతర్జాతీయ వత్తాసుదారుల)ల అసలు ఆందోళన. కాబట్టి, తమ రెండు పక్షాలు 2014 ఎన్నికల్లో అధికారానికి దూరమై; మరో ప్రత్యామ్నాయ విధానాల కూటమి, అధికారం పీఠం ఎక్కే పరిస్థితి గనక వస్తే ఏం చేయాలని, నేడీ రెండు పక్షాలు మదనపడుతున్నాయి. కాగా; మరో పక్కన నేడు బిజెపి తనకు తానుగా(మోడీ మ్యాజిక్ తో ) అధికారంలోకి రాబోతున్నట్లు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. మరి; ఈ నేపథ్యంలో శత్రుఘ్ను సిన్హా వ్యాఖ్యలు కానీ, జాతీయ ప్రభుత్వం గురించి వెలువడుతోన్న ఇతర వార్తలు గానీ దేశంలోని మధ్య తరగతికి కనువిప్పు కావాలి. నిజానికి; నేటి ఎన్నికల పోరులో బిజెపి బలం కొంత మేర వాపు మాత్రమే-అది నిజమైన బలం కాదు. కార్పొరేట్ల మద్దతు, కుప్పతెప్పల నిధులతో బిజెపి నేడు ఒక మీడియా మాయజాల కథను నడుపుతోంది. కానీ; ఈ కథ అంత సులువుగా నిజ రూపం ధరించలేదు. ఈ కారణం, ఆందోళనలతోనే-నేడు బిజెపి నేతలు జాతీయ ప్రభుత్వం గురించి మాట్లాడుతన్నారు...
-డి. పాపారావు
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications