సామాన్యుల ఇంటర్నెట్

Internet Magazine
కందుకూరి రమేష్ బాబు అనే జర్నలిస్టు సామాన్యుల కోసం ఇంటర్నెట్ పత్రికను ప్రారంభించారు. ఇది తెలుగు సామాన్యుల పత్రిక అని ఆయన చెప్పుకుంటున్నారు. ఇందులో రెండు రకాల రచనలుంటాయి. ఒకటి - సామాన్యుల రచనలు. రెండు - సామాన్యులపై రాసిన రచనలు. అయితే స్వయంగా సామాన్యులు రాసుకున్న రచనలకు ఇందులో ప్రాధాన్యం ఉంటుందని రమేష్ బాబు అంటున్నారు. వారి శైలి శిల్పాలతో సంబంధం లేకుండా రచించడమే ఏకైక విలువగా వారి అభివ్యక్తిని సామాన్యశాస్త్రం గుర్తిస్తుందని ఆయన చెప్పుకుంటున్నారు. సామాన్యుల రచనలు సేకరించి యధాతథంగా ప్రచురిస్తామని ఆయన చెప్పారు. ఇక రెండు రకం రచనలు తాము రాసేవని ఆయన అంటున్నారు. ఇందులో విశిష్టత కలిగిన సామాన్యులపై, సేవాదృక్పధం ఉన్న మామూలు మనుషులపై అక్షర జ్ఞానం ఉన్నవారు మొదలు రచయితలు, పాత్రికేయులు రాసిన రచనలు ఇవి. సంస్థగా ఎదిగినవారిపై ఇందులో చోటు లేదు.

ఈ విధంగా సామాన్యుల రచనలు, వారిపై రాసిన రచనలతో నెలనెలా ఈ మాసపత్రిక సామాన్యుల జీవితాలకు అక్షర నీరాజనం పలుకుతుంది. ఈ ప్రయత్నంలో ఆయా వ్యక్తులపై ముందు వ్యాసాలు రాస్తామని, అనంతరం పుస్తకాలు ప్రచురిస్తామని ఆయన చెప్పారు. ఈ పత్రిక నిర్వహణ కోసం సామాన్యశాస్త్రం ఇప్పటికే 119 మందిని కూడగట్టినట్లు రమేష్ చెప్పారు. వీరందరూ ఒక ఏడాది పాటు నెలనెలా ఇచ్చే వంద రూపాయలను ఫెలోషిప్ గా స్వీకరిస్తామని అన్నారు. వీరంతా ఆర్థిక సౌజన్యంతోనే సరిపెట్టుకోవడం లేదని, స్వయానా పౌర పాత్రికేయులుగా వ్యవహరిస్తూ తమకు తెలిసిన విశిష్టమైన వ్యక్తుల ఆచూకీ చెబుతున్నారని అంటూ ఈ సమిష్టి ప్రయత్నంలో జత కలవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

"ఈ జగత్తులో బతికిన మనుషులందరి గురించి ఓ లైబ్రరీ తెరవాలి. అందులో మీ పరిచయం తప్పక ఉండాలి" అనే ఆదర్శంతో, సమిష్టి పుస్తక ప్రచురణ లక్ష్యంగా సామాన్యశాస్త్రం రెండేళ్లుగా పేరులేని పెద్ద మనుషులపై పది పుస్తకాలు వెలువరించింది. లాభాపేక్ష లేకుండా ఈ పుస్తకాలను పది రూపాయలకే పాఠకులకు అందించింది. ఈ ఉత్తేజంతోనే సామాన్య శాస్త్రం మూడు నెలల క్రితం www.samanyashastram.com పేరుతో ఇంటర్నెట్ మాసపత్రికను ప్రారంభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+