శోభన్ ఇప్పటికీ అందాల హీరోనే

హీరోగా సినీ రంగం నుంచి తప్పుకున్న శోభన్ బాబు ఆ తర్వాత ఇటువైపు కన్నెత్తి చూడలేదు. చెన్నైలో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. జయభేరి సంస్థను నడుపుతున్న మురళీ మోహన్ కు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మెలుకువలు నేర్పింది శోభన్ బాబేనని అంటారు. ఆయన కూతుళ్లను, కుమారుడిని సినిమాలకు దూరంగా ఉంచారు. అప్పట్లో శోభన్ బాబు లాగా క్రాఫ్ చేసుకోవడం ఒక ఫ్యాషన్. జుట్టును పైకి దువ్వుకుని కొన్ని వెంట్రుకలను గుండ్రంగా నుదుటిపైకి తెచ్చి వదలడం ఆయన హెయిర్ స్టైల్. ఇది ఎంతో మంది యువకులకు అప్పట్లో ఫ్యాషన్. ఆయనకు మహిళాభిమానులు సంఖ్య ఎక్కువ. ఇద్దరు హిరోయిన్ల సినిమాల్లో నటించి మెప్పించిన ఘనత ఆయనది.
ప్రజల మదిలో అందాల నటుడిగానే మిగిలిపోవాలనేది శోభన్ బాబు ఉద్దేశం. ముసలితనంతో ప్రజల ముందుకు రావడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. 1995 తర్వాత ఆయన కెమెరా ముందుకే రాలేదు. ఆమె ఒక కుమార్తె అమెరికాలో ఉంది. ఆమె వచ్చిన తర్వాతనే శోభన్ బాబు భౌతిక కాయానికి అంత్యక్రియలు జరుగుతాయి. శోభన్ బాబు మృతికి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంతాపం ప్రకటించారు. శోభన్ బాబు మృతికి ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు కూడా సంతాపం ప్రకటించారు. శోభన్ బాబు అంత్యక్రియల్లో పాల్గొనడానికి సినీ రంగ ప్రముఖులు తరలి వెళ్తున్నారు. శోభన్ బాబు ప్రేమను తాను మర్చిపోలేనని ప్రముఖ సినీ నటి జయప్రద అన్నారు. శోభన్ ఇక లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నానని ఆమె అన్నారు. తనను అత్తా అని పిలిచేవారని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications