హక్కుల భాష్యకారుడు బాలగోపాల్

K Balagopal
గుండె ఎప్పటికప్పుడు చీరిపోతూ అంతరంగ గాయాలు సలుపుతూ ఉన్నా తాను ఉన్నంత కాలం ప్రజల కోసం, ముఖ్యంగా అభివృద్ధి అంచులకు ఆవల ఉన్నవారి కోసం పనిచేస్తూ పోయారు బాలగోపాల్. మానవ హక్కుల వేదిక నాయకుడు, మేధావి కె. బాలగోపాల్ మరణం ప్రజలకు తీరని లోటు. బాలగోపాల్ ఒక చారిత్రక సందర్బంలో తన కర్తవ్యాన్ని అందరి కన్నా గొప్పగా నెరవేర్చారు. ఆచరణకు, వ్యక్తిగత జీవితానికి మధ్య ఆయన తేడాను పాటించలేదు. తాను చెబుతున్న విలువలను ఆయన తన వ్యక్తిగత జీవితంలో అనుసరించారు. ఆయన తన అనుభవాల నేపథ్యం నుంచి, కార్యాచరణ నుంచి ప్రజా ఉద్యమాలను ప్రేమపూరితంగానే ప్రశ్నించారు. ఆ ప్రేమను కూడా భరించలేని స్థితికి విప్లవోద్యమ మేధావులు సహించలేకపోయారు.

బాలగోపాల్ బౌద్ధిక ప్రపంచంలో నిమగ్నతకే ప్రాధాన్యం ఇచ్చారు. ఆచరణ, ఇంగిత జ్ఞానం, విస్తృత అధ్యయనాలతో సమాజానికి ఉపయోగపడే ఆలోచనలను ఆయన చేశారు. పౌరహక్కలకు ఊపిరినిచ్చారు. ఆయన బాహ్య ప్రపంచం దాడులకు, బెదిరింపులకు ఏనాడూ లొంగిపోలేదు. విప్లవోద్యమంలోని లోటు పాట్లను ప్రశ్నించినందుకు ఆయనపై దారి తప్పిన బాలగోపాల్ అంటూ, ఇతరత్రా విమర్శల దాడి జరిగింది. అయినా ఆయన చలించలేదు. సమాజాన్ని మార్చాలని, కనీస విలువల వైపు సమాజాన్ని నడిపించాలని ఆయన ప్రయత్నించారు. జీవితంలో ఆయన ఏ రోజు కూడా రాజీపడలేదు. అందుకే ఆయన పదునుగా కొత్త ఆలోచనలను ఆయన మన ముందుంచగలిగారు.

పౌర హక్కుల ఉద్యమ పరిధి ఆయనకు సరిపోలేదు. గిరిజనులు, తెలంగాణవాళ్లు, ముస్లింలు వంటి అభివృద్ధికి ఆవల ఉన్న సమూహాల కోసం పోరాడేందుకు అది పరిమితులు విధించిందని అనుకోవాలి. అందుకే ఆయన మానవ హక్కుల వేదికను స్థాపించారు. ఆయన రాసిన వ్యాసాలు, సంపాదకత్వం వహించిన గ్రంధాలు సమాజాన్ని నూతన దిశగా తీసుకుపోయేందుకు ఎంతగానే పనికి వస్తాయి. గణితంలో దిట్ట అయిన బాలగోపాల్ సమాజం లెక్కలను తీశారు. ఆయన రాసిన రూపం - సారం పుస్తకం తెలుగు సాహిత్య విమర్శకు ఒక నమూనాగా పనికి వస్తుంది. రూపవస్తు సమన్వయాల సాధన ఏ విధంగా ఉంటుందో ఆయన ఆ పుస్తకంలోని వ్యాసాల్లో నిరూపించారు. ఆయన మరణం తెలుగు సమాజానికి తీరని లోటు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+