వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గమ్యం 'అనిల్‌' మర్డర్ మిస్టరీ

By Srikanya
|
Google Oneindia TeluguNews

Anil Reddy
గమ్యం సంగీత దర్శకుడు మృతి మిస్టరీగానే మిగిలిపోనుందా అనే సందేహాలు ఇప్పుడు టాలీవుడ్ ని పీడిస్తున్నాయి.మొదట ఆత్యహత్య అని ఆ తర్వాత హత్యగా రంగు మార్చుకున్న ఆ మృతి తెలుగు సినీ వర్గాల్లో బాగా సంచలనం సృష్టించింది.పోలీసుల తీరుపై అనిల్ బంధువుల నుంచి అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తమైనా మొదట పట్టించుకోని పోలీసులు ఎట్టకేలకు రీపోస్ట్ మార్టంను రెండ్రోజులు వాయిదా వేశారు.

అనిల్‌ కాబోయే భార్య షాలినిని కలవడానికి వెళ్లి అకస్మాత్తుగా చనిపోవడం..షాలినీతో పాటు డాక్టర్లు కూడా సహజ మరణమేనని చెప్పడంతో అనీల్ కుటుంబసభ్యులకు అప్పుడు ఎలాంటి సందేహాలు కలగలేదు. అయితే షాలిని కుటుంబ సభ్యుల తీరుతో మృతుడి బంధువులకు అనుమానం వచ్చి కేసు పెట్టగా..తర్వాత పోస్ట్‌మార్టం నిర్వహించారు. తలకు బలమైన గాయం కావడంతోనే అనిల్ చనిపోయాడని అందులో తేలటం అందరినీ షాక్ కు గురి చేసింది.

అయితే మళ్లీ షాలిని తరఫు నుంచి అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు రీ పోస్ట్‌మార్టంకు ఏర్పాటు చేశారు. ఇందుకు అనిల్ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా..అధికారుల తీరుపైనే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత గాంధీ ఆస్పత్రి వైద్యులతో పోస్టుమార్టం చేయించగా..ఈసారి మాత్రం ఉస్మానియా డాక్టర్లను పిలిపించారు. దాంతో అనుమానాలు మరింతపెరిగాయి. ఉస్మానియా వైద్యులతో పాటు, తొలుత పోస్ట్‌మార్టం చేసిన డాక్టరు, థర్డ్‌పార్టీ నిపుణుల పర్యవేక్షణ ఉండాలని అనిల్ కుటుంబ సభ్యులు కోరినా పోలీసులు లెక్కలోకి తీసుకోలేదు.

షాలినీ కుటుంబ సభ్యులు..ఖాకీలపై ఒత్తిళ్లు తీసుకురావడంతో పాటు రాజకీయ పలుకుబడితో కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అనిల్‌ సోదరుడు ప్రకాష్‌ అనుమానం వ్యక్తం చేయటం అందరికీ పలు అనుమానాలుకు తావిస్తోంది. షాలిని సమీప బంధువు ఆంటోనిరెడ్డితో పాటు ఓ ఏసీపీ ఇందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు తమకు న్యాయం చేయాలని అనిల్‌ కుటుంబ సభ్యులు హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసారు.

మంత్రి ఈ విషయమై సానుకూలంగా స్పందించారని..అనిల్‌ తల్లి రజినారెడ్డి మీడియాకు తెలిపారు. ఏదైతేనేంరీపోస్ట్‌మార్టం రెండ్రోజుల పాటు వాయిదా పడింది. అనిల్‌ బంధువులు అందుబాటులో లేరంటూ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఈ కేసు ఎప్పటికి క్లైమాక్స్ కి వచ్చేను..బాధితులకు న్యాయం ఎలా జరిగేను అనేది ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న.

English summary
Months after the death of music director Anil (Gamyam fame), mystery has come to shroud his untimely departure. It was believed that he died of cardiac arrest, but now his family suspects a conspiracy behind Anil's death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X