బ్రహ్మోత్సవ శోభ: గరుఢవాహనంపై శ్రీవారు(పిక్చర్స్)
తిరుపతి: శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఐదో రోజైన ఆదివారం రాత్రి 8 గంటల నుంచి శ్రీవారు గరుఢ వాహనంపై వైభవంగా విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. వాహనసేవ ప్రారంభమైన క్షణం నుంచి వరుణుడు కూడా గరుఢ వాహనంపై ఊరేగుతున్న శ్రీమన్నారాయణుడిని దర్శించడానికి వచ్చాడా అన్నట్లుగా ఆద్యంతం కుంభవృష్టిగా వర్షం కురిసింది.
సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ వర్షం అర్థరాత్రి వరకు కురుస్తున్నప్పటికీ వాహనం ఊరేగింపు విజయవంతంగా సాగింది. గరుడారూఢుడైన స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన లక్షలాది మంది భక్తులు వర్షాన్ని లెక్కచేయకుండా నిల్చున్నచోటు నుంచి కొంచెమైనా కదలకుండా గోవిందనామ స్మరణచేస్తూ తమ భక్తిని చాటుకున్నారు.
వర్షం కారణంగా గరుడ వాహనాన్ని గటాటోపం మాటున శ్రీవారు చతుర్మాడ వీధుల్లో ఊరేగించారు. దీంతో గరుడ వాహనాన్ని తిలకించడానికి భక్తులకు కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఈ పరిస్థితిని గమనించిన అధికారులు ప్రతి గ్యాలరీ వద్ద గరుడ వాహనాన్ని భక్తుల వైపు తిప్పారు.
ఇదిలాఉండగా ఓవైపు వర్షం కురుస్తుంటే మరోవైపు పొగమంచు తెరలుతెరలుగా తిరుమలను కప్పివేసింది. ఓవైపు విద్యుత్ దీపాల వెలుగులు మరోవైపు స్వర్ణమయ ఆనందనిలయకాంతుల మధ్య తెల్లటి పొగమంచు తెరులుతెరలుగా వెళుతున్న క్రమంలో సప్తవర్ణాలు భక్తుల హృదయాలను పులకింపజేశాయి.

బ్రహ్మోత్సవ వైభవం: గరుఢవాహనంపై శ్రీవారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఐదో రోజైన ఆదివారం రాత్రి 8 గంటల నుంచి శ్రీవారు గరుఢ వాహనంపై వైభవంగా విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు.

బ్రహ్మోత్సవ వైభవం
వాహనసేవ ప్రారంభమైన క్షణం నుంచి వరుణుడు కూడా గరుఢ వాహనంపై ఊరేగుతున్న శ్రీమన్నారాయణుడిని దర్శించడానికి వచ్చాడా అన్నట్లుగా ఆద్యంతం కుంభవృష్టిగా వర్షం కురిసింది.

బ్రహ్మోత్సవ వైభవం
సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ వర్షం అర్థరాత్రి వరకు కురుస్తున్నప్పటికీ వాహనం ఊరేగింపు విజయవంతంగా సాగింది.

బ్రహ్మోత్సవ వైభవం
గరుడారూఢుడైన స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన లక్షలాది మంది భక్తులు వర్షాన్ని లెక్కచేయకుండా నిల్చున్నచోటు నుంచి కొంచెమైనా కదలకుండా గోవిందనామ స్మరణచేస్తూ తమ భక్తిని చాటుకున్నారు.

బ్రహ్మోత్సవ వైభవం
వర్షం కారణంగా గరుడ వాహనాన్ని గటాటోపం మాటున శ్రీవారు చతుర్మాడ వీధుల్లో ఊరేగించారు. దీంతో గరుడ వాహనాన్ని తిలకించడానికి భక్తులకు కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది.

బ్రహ్మోత్సవ వైభవం
ఈ పరిస్థితిని గమనించిన అధికారులు ప్రతి గ్యాలరీ వద్ద గరుడ వాహనాన్ని భక్తుల వైపు తిప్పారు.

బ్రహ్మోత్సవ వైభవం
ఇదిలాఉండగా ఓవైపు వర్షం కురుస్తుంటే మరోవైపు పొగమంచు తెరలుతెరలుగా తిరుమలను కప్పివేసింది.

బ్రహ్మోత్సవ వైభవం
ఓవైపు విద్యుత్ దీపాల వెలుగులు మరోవైపు స్వర్ణమయ ఆనందనిలయకాంతుల మధ్య తెల్లటి పొగమంచు తెరులుతెరలుగా వెళుతున్న క్రమంలో సప్తవర్ణాలు భక్తుల హృదయాలను పులకింపజేశాయి.

బ్రహ్మోత్సవ వైభవం
ఇలవైకుంఠంలో బ్రహ్మోత్సవాలను తిలకిస్తున్నామన్న అనుభూతిని భక్తులకు కలిగించాయి.

బ్రహ్మోత్సవ వైభవం
ఇక వాహనం ముందు పాలసముద్రం చిలికే దృశ్యం, దశావతారాలు ఇలా వివిధ రకాల దేవతామూర్తుల వేషధారులు వర్షంలో తడుస్తూనే తమ ప్రదర్శనను కొనసాగించారు.

బ్రహ్మోత్సవ వైభవం
రాత్రి 1గంట వరకు సాగిన ఈ గరుడసేవలో మూడు లక్షలకు మందికిపైగా భక్తులు పాల్గొని ఉంటారని అంచనా.

బ్రహ్మోత్సవ వైభవం
రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన పట్టువస్త్రాలను మలయప్ప స్వామికి అలంకరించిన అర్చకులు ఆలయంలోని మూల విరాట్టుమూర్తికి ధరింపజేసే లక్ష్మీ సహస్రనామం, మకరకంఠి వంటి వజ్ర, వైడూర్య స్వర్ణ్భారణాలను విశేషంగా అలంకరింపజేశారు. అలాగే శ్రీవల్లి పుత్తూరు నుంచి వచ్చిన చిలకలు, మాలలను ధరింపజేశారు.

బ్రహ్మోత్సవ వైభవం
చెన్నై నుంచి వచ్చిన నూతన ఛత్రాలను వాహన సేవకు వినియోగించారు. గరుడ వాహనాన్ని తిలకించడానికి శనివారం అర్థరాత్రి నుంచే భక్తులు నిరీక్షించారు.

బ్రహ్మోత్సవ వైభవం
నాలుగు మాడవీధుల్లోని గ్యాలరీల్లోకి ఆదివారం ఉదయం 10 గంటల నుంచే చేరుకోవడం ప్రారంభించారు.

బ్రహ్మోత్సవ వైభవం
వాహన ఊరేగింపు సందర్భంగా స్వామివారిని చూడాలనే ఉత్సాహంతో గ్యాలరీల్లో అక్కడక్కడా భక్తులు కొంత ముందుకు రావడంతో చిన్నచిన్న తోపులాటలు చోటుకున్నాయి.

బ్రహ్మోత్సవ వైభవం
కాగా, వర్షం కురుస్తున్న సమయంలో ఆలయం ముందున్న గ్యాలరీల్లో ఇద్దరు భక్తులు సొమ్మిసిల్లి పడిపోయారు. వెంటనే వారిని స్థానిక అశ్విని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు.

బ్రహ్మోత్సవ వైభవం
అటు తరువాత వారిని తిరిగి వారు కూర్చున్న గ్యాలరీల్లోకే అనుమతించారు.

బ్రహ్మోత్సవ వైభవం
ఇక గ్యాలరీల్లో ఉన్న భక్తులకు, తిరుమలకు వచ్చిన భక్తులకు, కాలినడకన వస్తున్న భక్తులకు తాగునీరు, అల్పాహార, భోజనాలకు ఎలాంటి కొరత లేకుండా టిటిడి తీసుకున్న జాగ్రత్తలపై ప్రశంసలు వ్యక్తం అయ్యాయి.

బ్రహ్మోత్సవ వైభవం
ఇదిలావుండగా ఆదివారం ఉదయం 9 గంటలకు జరిగిన మోహినీ అవతారంలో లక్ష మంది భక్తులు పాల్గొన్నట్లు అంచనా. ఉత్సవాల్లో మూడు రోజులపాటు భక్తుల సందడి సాధారణంగా ఉన్నప్పటికి నాల్గవరోజైన శనివారం నుంచి భక్తులు పోటెత్తారు.

బ్రహ్మోత్సవ వైభవం
అందులోనూ తమిళులు అత్యంత పవిత్రంగా భావించే పెరటాసి మాసం తొలి శనివారం ప్రారంభం కావడంతో తిరుమలలో ఎటు చూసినా భక్తుల సందడే కన్పించింది.

బ్రహ్మోత్సవ వైభవం
ఈ బహ్మోత్సవాల్లో ఒక ఘటన అధికారులను, భక్తులను విస్మయపరిస్తే, మరొక ఘటన ఆందోళనకు గురిచేసింది.

బ్రహ్మోత్సవ వైభవం
అందులో ఒకటి గరుడోత్సవానికి శ్రీవల్లిపుత్తూరు నుంచి గోదాదేవి మాలలు, ఆమె ధరించిన బొమ్మచిలుకలు శనివారం రాత్రి తిరుమలకు చేరుకోగా మూలవిరాట్టు సన్నిధిలో భద్రపరిచారు.

బ్రహ్మోత్సవ వైభవం
అయితే గతంలో ఎన్నడూలేని విధంగా, తొలిసారిగా నిజమైన రెండు రామచిలుకలు మూలవిరాట్టు సన్నిధికి ప్రవేశమార్గంగా ఉన్న బంగారువాకిలి నుంచి లోపలికి ప్రవేశించి రాములవారి మేడకు చేరుకున్నాయి.

బ్రహ్మోత్సవ వైభవం
ఈ సంఘటన భక్తులను, అధికారులను మరింత ధార్మిక చింతనకు గురిచేసింది. అయితే ఆలయంలో కెమెరాలు నిషిద్ధం కావడంతో వాటిని ఎవరూ కెమెరాల్లో బంధించలేకపోయారు.

బ్రహ్మోత్సవ వైభవం
అయితే ఈ రెండు చిలుకలు శ్రీవల్లిపుత్తూరు నుంచే వచ్చి ఉంటాయని భక్తులు, ఆలయ వర్గాలు భావిస్తున్నారు. ఈ అంశంపై ఆలయ డిప్యూటి ఈఓ చిన్నంగారి రమణ వివరణ ఇస్తూ ఆదివారం ఉదయం స్వామివారికి సాత్తుమొర నిర్వహిస్తున్న సమయంలో రెండు చిలుకలు రావడం అద్భుతమన్నారు.

బ్రహ్మోత్సవ వైభవం
లయకారకుడైన పరమేశ్వరుడిని మనసును సైతం మాయచేసిన మహావిష్ణువు మోహినీ అవతారంలో శ్రీవారు బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య మోహినీ అవతారంలో భక్తకోటిని సమ్మోహితులను చేశారు.

బ్రహ్మోత్సవ వైభవం
పొడవాటి వాలుజడ, సుగంధ పరిమళాలు వెదజల్లే పుష్పాలంకరణలు, చేతిలో బంగారు చిలుక, నడుముకు వడ్డాణం, ఒంటినిండా నగలు, వయ్యారం ఒలకపోస్తూ చీర కొంగుమాటున చిరునవ్వులు చిందిస్తూ ఓరకంట చూపులతో దంతపు పల్లకిని అధిరోహించి మోహిని అవతారంలో ఊరేగుతున్న శ్రీవారి సుందర రూపం అందాలరాశులైన మహిళామణులు సైతం కళ్లార్పకుండా చేసేంత అందంగా స్వామివారు విశ్వమోహని రూపంలో భక్తులను కనువిందు చేశారు.












Click it and Unblock the Notifications